ఒకనాటి గోల్డెన్ లెగ్ హీరొయిన్ కాజల్‌ పెళ్ళి కాకుండానే విడాకులు కోరుకుంటోంది. ఇప్పటి వరకు పెళ్ళి కూడ అవ్వని కాజల్ కు అప్పుడే విడాకులు ఎందుకు కోరుకుంటోంది అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈమధ్య చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న కాజల్‌ అగర్వాల్‌ తెలుగులో రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో తప్ప మరే తెలుగు సినిమాలోనూ చేయడంలేదు. తమిళంలో ధనుష్‌తో ఒక చిత్రంలో చేస్తోంది. తాజాగా ఈ మధ్యన ఆమె ఓ హిందీ సినిమాలో 'త్రీ ఇడియట్స్‌' ఫేమ్‌ శర్మాన్‌ జోషితో కలిసి నటించేందుకు ఒప్పుకుంది. ఇరానియన్‌ సినిమా 'సీజ్‌ ఫైర్‌'కి రీమేక్‌ అయిన ఈ సినిమాలో కాజల్‌ భర్త నుంచి విడాకులు కోరుకునే భార్య పాత్ర పోషిస్తోంది. విడిపోదామని అనుకున్న తర్వాత మళ్లీ ఒక్కటైన జంట మధ్య జరిగే కథ ఇది. చాల వాస్తవికంగా ఉండే అనేక సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి అని అంటున్నారు. ఈ సినిమా ఇరాన్‌లో ఎన్నో ప్రశంసలు అందుకుని అవార్డులు కూడా గెలుచుకుంది. చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేయడానికి ఇష్టం చూపెట్టినా అనేక ఆడిషన్స్ తరువాత ఈ సినిమాకు హీరొయిన్ గా కాజల్ ను ఎంపిక చేసారట. ఈ పాత్ర కాజల్‌కి దక్కడం అదృష్టo అంటు బాలీవుడ్ మీడియా కాజల్ పై ప్రసంసలు కురిపిస్తోంది.  తన పాత్రల ఎంపికలో కూడా కాజల్‌ మునుపటి కంటే చాలా మెచ్యూరిటీ చూపిస్తోంది అని అంటున్నారు. అంతేకాదు హీరోతో చెట్లు, పుట్టలు పట్టుకు తిరిగే పాత్రలు చేయనని కాజల్‌ చెపుతోంది అని అంటున్నారు. ఇప్పటికే పారితోషికం విషయంలో అనేక పెద్ద సినిమాలు వదులుకున్న కాజల్ ఈ కొత్త విధానం వల్ల కాజల్ మరిన్ని సమస్యలలో పడుతుంది అంటు కామెంట్స్ వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: