అమలాపాల్ దృష్టి ఇప్పుడు నెంబర్ వన్ స్థానం మీద ఉంది. ఈ భామ ఫోటో షూట్ చేయించినా, ఇంకేమి చేసినా బాలీవుడ్ స్థాయికి తగ్గకుండా చూసుకుంటుంది. ఈ విషయాన్ని గురించి అమలను అడిగితే ‘‘నెంబర్ వన్ స్థానం మనం ప్రయత్నిస్తేనో, ఇంకొకరు ఇవ్వాలనుకుంటేనో రాదు. కేవలం రాత రాసి ఉంటే తప్పకుండా వస్తుంది. ఇకపోతే బాలీవుడ్ లో నటించమని ఇప్పటికే కొన్ని ఆపర్లు వచ్చాయి. నేనే ఆలోచిస్తున్నాను. అక్కడ నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే దక్షిణాదిన చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు బాలీవుడ్ కు ఎంటరైతే ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను’’ అని అంటోందీ గడుసరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: