నిన్న మోడీ చంద్రబాబులతో కలిపి సీమాంధ్ర ప్రదేశ్ లో మోడీనీ, చంద్రబాబునీ అధికారంలోకి తీసుకు రండి అంటు పవన్ చేసిన ఆవేశ పూరిత ఉపన్యాసాలలో రాష్ట్ర విభజన జరగడానికి ఒక్క జగన్ మాత్రమే కారణం అంటు రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను వెనకేసుకు వస్తూ ఆవేశంగా జగన్ హఠావో సీమాంధ్ర బచావో అని నిన్న అన్ని సభలలోను ఒకే రికార్డు ఉపన్యాసాన్ని వినిపిస్తున్న పవన్ కు ఈ విషయం తప్పించి ఇంక ఏ సమస్య పై పవన్ ఎందుకు మాట్లడటం లేదు అనే ప్రశ్నల వర్షం ప్రారంభమైంది.  జగన్ ను తిట్టడంలో పవన్ కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేక పోతున్నా బాబు సమైక్యం కోసం కృషి చేసారని పవన్ చేస్తున్న ప్రశంసలు సామాన్యుల మైండ్ ను సహితం బ్లాంక్ చేస్తున్నాయి. తలుపులు వేసి అప్రజాస్వామికంగా తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు కూడా మద్దతు ఇచ్చిన భాజపా పార్టీ నాయకుడు మోడీని పక్కన పెట్టుకుని, అక్రమంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడంలో జగన్ పాత్ర ఉంది అంటూ పవన్ వరస పెట్టి చేస్తున్న ఒకే రకం ఊక దంపుడు ఉపన్యాసాలు అర్ధంకాక కోస్తా ప్రాంతంలోని పవన్ అభిమానులు కూడ ఎటూ మాట్లాడలేని స్థితిలో పవన్ ఉపన్యాసాలకు పైకి చప్పట్లు కొడుతున్నా లోలోపల ముంచుకు వస్తున్న ప్రశ్నల వర్షం మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కోస్తా జిల్లాల టాక్.   తెలంగాణాలో కెసిఆర్ ను, సీమాంధ్రలో జగన్ ను టార్గెట్ చేసుకుంటూ పవన్ చేస్తున్న ఉపన్యాసాలు ఇంచుమించు ఒకే రకంగా ఉండటంతో అవి వికటిస్తే పవన్ తన కెరియర్ విషయంలో భవిష్యత్తులో భారీ మూల్యమే చెల్లించుకోవలసిన పరిస్థుతులు ఏర్పడతాయని విశ్లేషకుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: