సీమాంధ్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా తమ తీర్పుఇచ్చి మోడీ- చనంద్ర బాబుల విజయానికి తమ ఓట్ల ద్వారా సహకరించకపోతే తాను శాస్వితంగా సినిమాలు మానేసి ఉద్యమబాట పడతానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశాడు. డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తుందని, ఆ పార్టీ నేతలిచ్చే డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం టీడీపీ- బీజేపీ అభ్యర్థులకే వేయాలని ఆయన పిలుపునిచ్చారు.  అయితే డబ్బులు తీసుకుని ఓట్లు వేయండి అని పవన్ అంటున్న మాటల పై ఎన్నికల సంఘానికి వైసీపి వర్గాలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో పోటా పోటీగా జరుగుతున్న ఈ ఎన్నికలలో కాపు సామాజిక వర్గం ఓట్లు సాధించడానికి చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే కాపుసామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఉప ముఖ్య మంత్రి పదవి ఇస్తాను అని ప్రకటించిన నేపధ్యంలో సినిమాలు శాస్వితంగా మానేస్తే పవన్ చంద్రబాబు దగ్గర ఉప ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో సెటిల్ అవుతాడా? అనే సెటైర్లు పవన్ పై పవన్ వ్యతిరేక వర్గం వేస్తోంది.  క్షణక్షణం మారిపోయే రాజకీయాలను నమ్ముకుని పవన్ తన సినిమాల విషయంలో చేస్తున్న సంచలన ప్రకటనలు పవన్ అభిమానులను ఆందోళనలో పడేస్తున్నాయి.  ఏమైనా ఎన్నికల తరువాత ఫలితాలు ఎలా ఉన్నా పవన్ సినిమాలు అసలు ఉంటాయా అనే ఆతృత ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: