టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వెళ్ళిన యంగ్ టైగర్ ఎన్టీర్ , గత కొంత కాలంగా చూసుకుంటే చెప్పుకోదగ్గ స్థాయిలో తన మూవీలను బాక్సాపీస్ వద్ద టాప్ పొజిషనల్ లో నించోపెట్టలేకపోతున్నాడు. దీనికి కారణం ఎన్టీఆర్, దర్శకులపై తీసుకువస్తున్న ఒత్తిడే కారణం అంటూ టాలీవుడ్ లో బాహాటంగానే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే యంగ్ టైగర్ పెళ్ళి చేసుకున్న తరువాత నుండి చెప్పుకోదగ్గ సక్సెస్ లను అందుకోలేదన్నది అందరూ గమనించ దగ్గ విషయంగా మారింది. అయితే ఎలాగైన ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇవ్వటానికి చివరగా ఎన్టీఆర్ మామ రంగలోకి దిగాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. దాదాపుగా టాప్ స్టార్స్ అందరికీ నిర్మాణ సంస్థలున్నట్టే తనూ ఓ సంస్థను స్థాపించే సన్నాహాల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 23వ సినిమాగా "రభస"లో నటిస్తున్న ఎన్‌టిఆర్, తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. 25వ సినిమాకు తన సన్నిహితుడైన వి వి వినాయక్ లేదా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకుడుగా ఉంటారని వినిపిస్తోంది. ఈ సంస్థ నిర్వహణను ఎన్‌టిఅర్ మామగారు, స్నేహితులు పర్యవేక్షిస్తారని, 2014లోనే షూటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయని వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు యంగ్ టైగర్ మామ గారు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం.ఎన్టీఆర్ కు సక్సెస్ ను ఇవ్వటానికి ఫైనల్ గా మామ గారు కూడ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: