తన తొలి చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'లో 21 ఏళ్ల అలియా ఒక ముద్దు సీన్‌లో నటించింది. బికినీ కూడా ధరించింది. అయితే తన అప్ కమింగ్ ఫిల్మ్స్ కు సంబంధించిన దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. అంతే కాకుండా తనపై వస్తున్న బ్యాడ్ టాక్స్ పై అలియా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బాలీవుడ్‌లో ఇప్పుడే అడుగుపెట్టిన అలియాభట్ తానేం చేయవచ్చో, చేయకూడదో త్వరగా పాఠాలు నేర్చుకున్నట్లుంది. ముద్దు పెట్టుకునే సీన్లలో చివరికి బికినీ ధరించిన సీన్స్ లో అయినా నటించగలను కాని నగ్నత్వాన్ని తానేమాత్రం భరించలేనని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. తన తత్వానికి ఏమాత్రం సరిపోదు కనుకే తను నగ్న దృశ్యాలలో ఎన్నటికీ నటించను, నటించబోను అంటూ తేల్చి చెప్పింది. అలియ ఈవిధంగా చెప్పటానికి కారణం ఏమిటంటే తన అప్ కమింగ్ ఫిల్మ్ లో అలియా న్యూడ్ సీన్స్ చేయటానికి ఇంట్రెస్ట్ గా ఉందంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో అలియా మీద బ్యాడ్ రూమర్ క్రియోట్ అవ్వటం తనకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చింది. తను పెరిగిన పరిసరాలు, పెంపకం రీత్యా తనా పని చేయలేను. అంటూ అలియా భట్ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో అలియ ఎటువంటి న్యూడ్ సీన్స్ లో నటించడం లేదంటూ బిటౌన్ కు క్లారిటి వచ్చిందంటున్నారు. మొత్తానికి అలియ భట్ ఏం మాట్లాడినా, బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: