నాగార్జున నట వారసుడు నాగ‌చైత‌న్య ఎక్కాల్సిన ఛార్మినార్ ఇప్పుడు మ‌హేష్‌బాబు బావ సుధీర్‌బాబు ఎక్కుతున్నాడు అంటు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.. క‌న్నడ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రం `ఛార్మినార్‌`. ఈ సినిమాకు చంద్రు ద‌ర్శక‌త్వం వ‌హించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని చాలా రోజులుగా ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. సినిమా హ‌క్కుల్ని ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ సొంతం చేసుకొన్నారు. తొలుత నాగ‌చైత‌న్యకి చూపించారు. చైతూకి సినిమా న‌చ్చడంతో చేయ‌డానికి సిద్ధమ‌య్యాడు అనే వార్తలు కూడ వచ్చాయి.. అయితే ఏమైందో తెలియ‌దు కానీ ప్రాజెక్టు నుండి చైతన్య తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని మ‌హేష్ బాబు బావ, `ప్రేమ‌క‌థా చిత్రమ్‌` ఫేమ్ సుధీర్‌బాబుతో తీస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఛార్మినార్ పేరుతోనే తెర‌కెక్కనున్న ఈ సినిమా త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది అని అంటున్నారు. ఇందులో క‌థానాయిక‌గా నందిత ఎంపికైన‌ట్టు తెలిసింది. ఇదివ‌ర‌కు సుధీర్‌, నందిత క‌లిసి `ప్రేమ‌క‌థా చిత్రమ్‌`లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన కారణంగా మళ్ళీ అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు కూడ కన్నడ వర్షన్ దర్శకత్వం వహించిన చంద్రు దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్యకు మహేష్ బాబు ముద్దుల బావమరిది సుధీర్ బాబు గట్టి షాక్ ఇచ్చాడనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: