టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు వస్తున్న హీరోయిన్స్ ఎంతటి ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నప్పటికీ, టాలీవుడ్ లో నటించేటప్పుడు మాత్రం తెలుగు వారికి తగ్గట్టుగా నటించాల్సిందే. అయితే రీసెంట్ గా ఓ క్రేజీ హీరోయిన్ మాత్రం, తన దగ్గర ఉన్న టాలెంట్స్ అన్నింటినీ బయటకు చెప్పేసి, ఇక మీ ఇష్టం అనేసింది. దీంతో మూవీ మేకర్స్ ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అంటే పెద్ద హీరోలకు సైతం ఆఫర్స్ ఇవాలని పిస్తుందట. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకు కరెంటు తీగ అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా షూటింగ్ మొదలైనా ఈ మూవీలో రాకుల్ ప్రీత్ సింగ్ , మంచు మనోజ్ తో జతకట్టనుంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకు కథ నచ్చితే బికినీ సైతం ధరించటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ స్టేట్ మెంట్ కు టాలీవుడ్ షాక్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ బికిని ధరిస్తే, దాన్ని ఏ విధంగా చూపించాలన్నదే టాలవుడ్ ఆలోచనట. త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఓ బడా హీరో మూవీలో నటించటానికి సిద్ధంగా ఉంది. ఆ మూవీలో ఈ బ్యూటి చేత బికిని సీన్స్ ఉంటాయంటున్నారు. అందుకే తను ఈ విధంగా మాట్లాడి ఉంటుందని టాలీవుడ్ అంటున్నారు. మొత్తానికి రకుల్ చెప్పిన ఆఫర్ బాగానే ఉన్నప్పటికీ, తను ఏ మూవీలో ఆ విధంగా దర్శనం ఇస్తుందో అని ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: