ఒకప్పుడు టాలీవుడ్ యాంగ్రీ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ ప్రస్తుతం సినిమాలలో తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాడు. రాజకీయాలలో కూడ అతడి ప్రస్తుత పరిస్థితి ఒక జోకర్ లా మారింది. అటువంటి రాజశేఖర్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను వాడుకోబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వంద కోట్ల పైచిలుకు వ్యయంతో తెర‌కెక్కిన ర‌జ‌నీకాంత్ చిత్రం `కోచ్చడ‌యాన్‌` ఈవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే మోష‌న్ కేప్చర్ టెక్నాల‌జీతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుస్తున్న తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో రజనీకాంత్ పాటు రాజ‌శేఖ‌ర్ సంద‌డి చేయ‌బోతున్నాడు అని టాక్.  రాజశేఖ‌ర్ న‌టించిన `ప‌ట్టప‌గ‌లు` ట్రైల‌ర్‌ని `విక్రమ‌సింహ‌` సినిమాతోపాటు ప్రద‌ర్శించ‌బోతున్నార‌ట‌. ఆ మేర‌కు విక్రమ‌సింహ‌ చిత్రబృందంతో సంప్రదింపులు జ‌రుపుతున్నట్టు తెలుస్తోంది. రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రం `ప‌ట్టప‌గ‌లు`. హార్రర్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాజశేఖర్ కు బ్రేక్ ఇస్తుందని రాజశేఖర్ చాల ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం వర్మ క్రేజ్ కూడ లేని పరిస్థుతులలో పరాజయాల బాటలో నడుస్తున్న వర్మ రాజశేఖర్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మార్కెట్ అవ్వడం కష్టం అనే మాటలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: