ట్రెండ్ సృష్టించడంలో రజినీని మించిన వారు మన దక్షిణాది సినిమా రంగంలో మరెవ్వరు లేరు. ఆయన సిగరెట్‌ వెలిగిస్తే అదో సెన్సేషన్‌.. కాయిన్‌ పైకెగరేస్తే ఒక స్టయిల్‌. సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాలీవుడ్‌లోనే కాక, ప్రపంచ వ్యాప్తంగానూ నటుడిగా పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాంటి రజనీకాంత్‌ తొలిసారిగా ట్విట్టర్‌లో అకౌంట్‌ తెరిచారన్న వార్త అతని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.  రజనీకాంత్‌ తొలి ట్వీట్‌కి ఎంత ఫాలోయింగ్‌ వుంటుంది.? అన్న విషయమై ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు రజనీ తొలి ట్వీట్‌ రికార్డుల్ని సృష్టిస్తుందన్నది అభిమానుల గట్టి నమ్మకం.తన ‘కొచాడియాన్‌’ రిలీజ్‌ నేపథ్యంలో, ఆ సినిమా ప్రమోషన్‌ తో పాటు తన క్రేజ్ కు ఎదురు లేదు అని సంకేతాలు ఇవ్వడం కోసమే రజినీ ఇంత హడావిడిగా ట్విటర్ ఎకౌంట్ ను ఓపెన్ చేస్తున్నాడు అని అనుకోవాలి.  సూపర్‌ స్టార్‌ తొలి ట్వీట్‌ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అన్న ఆశక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ వారం విడుదల అవుతున్న 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమసింహ'గా విడుదల కానుంది. తెలుగు వెర్షన్ రైట్స్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ లక్ష్మిగణపతి ఫిలిమ్స్ ఈ సినిమాను రూ.25 కోట్లు పెట్టి కొన్నట్లు ట్రేడ్ టాక్.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 'భాషా' సినిమా రిలీజ్ సమయంలో ఆ సినిమా తెలుగు వెర్షన్ హ్కకుల కోసం అప్పట్లో నిర్మాతలెవ్వరూ ముందుకు రాలేక పోవడంతో ఆ సినిమా రైట్స్ ను కేవలం 10 లక్షలకు అమ్మడం జరిగింది అని అంటారు. అలాంటి స్థాయి నుండి ఈరోజు ఒక డబ్బింగ్ సినిమాకు 25 కోట్లు పెట్టడం జరుగుతోంది అంటే అభిమానులలో రజినీ మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: