భారతదేశ జనాభా 125 కొట్లలో సినిమాలు చూసేవారికే కాదు సినిమాలు చూడని వారికి కూడ అమితాబ్ పేరు తెలియని వారుండరు. అటువంటి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు క్యాన్సర్ వ్యాధి సోకింది అంటు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్త అమితాబ్ అభిమానులకు ఒక రకమైన షాకింగ్ న్యూస్. కాని అమితాబ్ కు ఈ వ్యాది తొలి దశలోఉండడంతో అస్సలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ అంటున్నారట. అమితాబ్ గత కొన్ని నెలలుగా రెగ్యులర్ గా ఆస్పత్రికి వెళుతున్నారని ఇంటస్టైన్ లో కేన్సర్ లక్షణాలు కనిపించడంవల్ల చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. అయితే అమితాబ్ మాత్రం ఈ మధ్య ఎక్కడ కనిపించినా హుషారుగా ఉండడంతో ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని నమ్మరు. అయితే వ్యాధి ఇంకా తొలి దశలోనే ఉన్నందున చికిత్స కూడా చాలా సులువుగానే ఉండటమే కాకుండా అమితాబ్ అంతకుమించిన ఆత్మ విశ్వాసంతో ఉండడంతో త్వరలోనే బిగ్ బి ఈ వ్యాధిని జయిస్తారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అమితాబ్ ఆరోగ్యం పై మీడియాలో ఇలాంటి వార్తలు వస్తూ ఉంటే ఈ మధ్యనే ‘మనం’ సినిమా కోసం అమితాబ్ డబ్బింగ్ చెప్పిన నేపధ్యాన్ని బట్టి అమితాబ్ పరిస్థుతులను ఎలా ఎదుర్కుంటారో అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: