ఏ ముహూర్తంలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చేశాడో సందీప్.. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు అతనికి మంచి అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు సందీప్. ప్రస్తుతం రారా కృష్ణయ్య సినిమా చేస్తున్న సందీప్ ఆ సినిమా తర్వాత పండగలా దిగివచ్చాడు అనే సినిమా చేయబోతున్నాడట. గుండెల్లో గోదారి సినిమాతో డైరక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కుమార్ నాగేంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్ ప్రెస్ సినిమా హిట్ తో సందీప్ కూడా ఎక్స్ ప్రెస్ లా సినిమాలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ పండగలా దిగివచ్చాడు సినిమా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సగం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుందట. ఇంకా ఇవే కాకుండా 14 రీల్స్ అండ్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ లో కూడా వరుసెంట సినిమాలు చేస్తున్నాడట సందీప్. రారా కృష్ణయ్య సినిమా వచ్చే నెలలో రిలీజ్ అవ్వబోతుంది. రొటీన్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించిన సందీప్, రెజీనాల జంట మళ్ళీ ఈ సినిమాతో అలరించనున్నారు. ఏది ఏమైనా అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ ని సంపాదించిన సందీప్ కిషన్ ఇలానే మంచి సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టాలని అటు ఆడియెన్స్ తో పాటు ఎపిహెరాల్డ్.కామ్ కూడా కోరుకుంటుంది.  సందీప్ కెరియర్ పై మీ కామెంట్..? రొటీన్ జంట మరళ అలరిస్తుందా..?     

మరింత సమాచారం తెలుసుకోండి: