టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం నెం.1 హీరోగా ఉండి మెగాస్టార్‌ అనిపించుకున్న చిరంజీవి ఇప్పటి వరకు 149 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత చిరు రాజకీయాల్లోకి వెళ్లి పోయాడు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కింగ్‌గా మారాలనుకున్న చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎక్కువ స్థానాలు సాధించక పోవడంతో కింగ్‌ మేకర్‌గా మిగిలి పోయాడు. ఇక చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ఆయన 150వ చిత్రం గురించి అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వస్తునే ఉన్నాయి. రాజకీయాతో బిజీగా ఉండటం వల్ల చిరంజీవి 150వ చిత్రం చేయలేక పోతున్నట్లు పలు సార్లు ప్రకటించాడు. ఆ మధ్య చిరంజీవి కోసం కథ సిద్దం అయ్యిందని, వినాయక్‌ దర్శకత్వం వహిస్తాడు అని, చరణ్‌ నిర్మిస్తాడు అంటూ కథనాలు వచ్చాయి. అయితే అవన్ని కూడా ఒట్టి గాలి వార్తల్లాగే మిగిలి పోయాయి. ఇక తాజాగా రాజకీయ పరిస్థితులను చూస్తుంటే చిరంజీవి మళ్లీ మెహానికి రంగు వేసుకునే రోజులు వచ్చాయి అని అనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా ఇంత కాలం బిజీ బిజీగా గడిపిన చిరంజీవి ఇకపై కాలిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాదు అని తేలిపోయింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో చిరంజీవికి ఖాలీ సమయం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంను సినిమాలకు వినియోగించుకోవాలని చిరు డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా చిరు ఎక్కువ బిజీగా ఉండడు కావున తన పాత ఫీల్డ్‌ అయిన సినిమా ఇండస్ట్రీకే వచ్చి మళ్లీ సినిమాలతో బిజీ కావాలని యోచిస్తున్నాడు. ఈ ఎన్నికల హడావుడి, రాష్ట్ర విభజన పక్రియ పూర్తి కాగానే చిరంజీవి సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే చిరంజీవి 150వ చిత్రం ఇదే సంవత్సరం ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆ చిత్రంను రామ్‌చరణ్‌ నిర్మించనుండగా దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. గత కొంత కాలంగా చిరు 150వ చిత్రం వినాయక్‌ దర్శకత్వంలో అని ప్రచారం జరిగింది. అయితే మరేవరైనా మంచి కథలతో వస్తే అందులో నటించేందుకు అయినా సిద్దంగా మెగాస్టార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క 150వ చిత్రంతో ఆపేయకుండా ఇక ఆపై వరుసగా చిత్రాల్లో నటించాలని మెగాస్టార్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల వరకు చిరంజీవి సినిమాలతో బిజీ బిజీగా గడిపేయాలని నిర్ణయించుకున్నాడు. 150వ చిత్రం తర్వాత కొడుకు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఒక చిత్రం చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, చరణ్‌ కాంబినేషన్‌ కోసం ఒక కథను ప్రముఖ దర్శకుడు సిద్దం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత కాలం రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న చిరు తాజాగా మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నాడు అనే వార్త మెగాస్టార్‌ అభిమానులకు సంతోషంను కలుగ జేస్తోంది. మరి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్‌ ఎలాంటి సక్సెస్‌లను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: