స్టార్ ఇమేజ్ ని సంపాదించడం హీరోలకు వెన్నతో పెట్టిన విద్య. కాని స్టార్ హీరో అవ్వడం అనేది అంత సాధారమైన విషయమేమి కాదు. అలాగని ఒక్క సినిమా హిట్ అయితే స్టార్ ఇమేజ్ రాదు. దానికి కొంత సెపరేట్ స్టామినా ఉండాలి. ప్రస్తుతం స్టార్ హీరోలు అంటే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాన్..మహేష్ బాబు.. ఎన్.టి.ఆర్.. ప్రభాస్.. రామ్ చరణ్.. కాని ఇప్పుడు ఆ స్టార్ ఇమేజ్ ని సొంతం చెసుకున్నాడు అల్లు వారి అబ్బాయి కూడా.. గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్, ఆర్య సినిమాతో సూపర్ హిట్ కొట్టి యూత్ హీరో అనిపించుకున్నాడు అడపాదడపా సూపర్ హిట్లు కొట్టి క్రేజీ హీరో అయినా స్టార్ ఇమేజ్ బాక్సా ఫీస్ హీరో అనిపించుకోలేదు. ఆ మధ్య వచ్చిన బద్రినాథ్ సినిమాకు ఓ తెగ హడావిడి చేసి ఒకే సారి బాక్సా ఫీస్ రికార్డులు బద్దలు కొడతాడు అని అల్లు అరవింద్ చాటింపేసి మరి చెప్పి ఆ సినిమాను భారి రిలీజ్ చేసిన అది తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఇప్పుడు ఏ అంచనాలు లేకుండా వచ్చిన రేసు గుర్రం మాత్రం అల్లు అర్జున్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. కూల్ అండ్ కాం గా వచ్చిన ఈ సినిమా బన్ని ఇదవరకు వచ్చిన అన్ని సినిమాలను ఓవర్ టేక్ చేసి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అంతేకాదు స్టార్ హీరోల రికార్డుల సైతం మట్టికరిపిస్తుందని ఏపిహెరాల్డ్. కామ్ కి అందిన సమాచారం. సో ఏది ఏమైనా బన్ని ఇన్నాల్టికి అనుకున్న స్టార్ హోదాని దక్కించుకున్నాడని అనుకుంటున్నారు సినీ విమర్శకులు. సో బన్నీ ఇప్పుడు స్టార్ హీరో అండ్ తన సినిమా రిలీజ్ అవుతుందంటే మిగతా స్టార్ హీరోలు కూడా వారి పాత రికార్డులు మాసిపోతాయేమోనని బయపడేలా చేశాడు. బన్నీ స్టార్ ఇమేజ్ పై మీ కామెంట్..?   

మరింత సమాచారం తెలుసుకోండి: