బాలీవుడ్లో ఎందరు డైరెక్టర్స్ వున్నా .... మహేష్ భట్ స్టైల్ కాస్త సపరేట్! ఆయన సినిమాలు వివాదాస్పదమే... ఆయన సిద్ధాంతాలు కూడా వివాదాస్పదమే! అయితే, ఈసారి మాత్రం మహేష్ భట్ ఓ పాజిటివ్ విషయంతో న్యూస్ లోకి వచ్చాడు. ఇంతకీ, ఈ బాలీవుడ్ కాంట్రవర్సియల్ వెటరన్ డైరెక్టర్ చేసిన మహేష్ భట్ డెబ్యూ చేయనున్నాడు! అదేంటి, ఆయన సీనియర్ దర్శకుడు, పైగా ఆయన కూతురు ఆలియా కూడా సినిమాల్లోకి వచ్చేసింది... ఇప్పుడేం డెబ్యూ అంటారా? అఫ్ కోర్స్, ఈ సీనియర్ సెన్సేషన్ కి లేటు వయసులో యాక్టర్ అవ్వాలన్న కోరిక పుట్టింది! దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఇంతకీ మహేష్ భట్ నటుడిగా మన ముందుకొస్తోన్న సినిమా పేరేంటో తెలుసా? సిద్ధార్థ్! ప్రత్యేకంగా ఇందులో ఓ పాత్ర పోషించటానికి మహేష్ ఉత్సాహం ఎందుకు చూపాడంటే.... అది ఓ బౌద్ధ సన్యాసి పాత్ర కాబట్టి! అవును... ప్రస్తుతం మనాలీలో షూట్ జరుపుకుంటున్న సిద్ధార్థ్ మూవీలో మహేష్ భట్ బుద్దిస్ట్ మాంక్ గా కనిపించనున్నాడు.... తన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన ``స్టెప్పింగ్ ఇన్ టూ ద ఫ్రేమ్ ఆఫ్ సైలెన్స్`` అని కామెంట్ చేశాడు! సిద్ధార్థ్ సినిమా దర్శకుడు ముకుల్ మిశ్రాకు కూడా ఇదే తొలి సినిమా. అలాగే హీరో క్యారెక్టర్ చేస్తున్న నటుడు శివమ్ భార్గవ్ కూడా పెద్దగా నేమ్ అండ్ ఫేమ్ వున్నవాడేం కాదు. కాకపోతే హీరోయిన్ గా, బౌద్ధ సన్యాసి అయిన మహేష్ భట్ కు కూతురుగా షాజన్ పదమ్సే నటిస్తోంది. ఎక్స్ పెరిమెంటల్ మూవీగా తెరకెక్కుతోన్న సిద్ధార్థ్... మరి ఈ ఆరెంజ్, మసాలా సినిమాల సెక్సీ బ్యూటీకి ఎంత వరకూ కలిసి వస్తుందో... వి హ్యావ్ టూ వెయిట్ అండ్ సీ!

మరింత సమాచారం తెలుసుకోండి: