నిర్మాతగా అడుగు పెట్టి ఆ తరువాత నటిగా మారిపోయి మధ్యలో బుల్లితెర యాంకర్ గా అవతారమెత్తి ఏ రోజు ఎలా కనిపిస్తుందో మంచు లక్ష్మికే తెలియదు. ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ సినిమాలు తీయడం కన్నా కిచెన్ లో ప్లేట్లు కడగడం సులువు అని ఈమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఈ మధ్య మంచు లక్ష్మి నటించిన ‘చందమామ కధలు’ సినిమా పరాజయం చెందడంతో నిరాశగా ఇలా మాట్లాడిందా అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఈసినిమా పరాజయం చెందినా నటిగా మంచు లక్ష్మికి మంచి మార్కులే వచ్చాయి. ఈమె దురదృష్టం ఏమిటో తెలియదు కాని నటిగా మంచి పేరు వస్తున్నా విజయాలు మాత్రం శూన్యం. మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మి మరికొన్ని ఆశక్తికర విషయాలను కూడ చెప్పింది.  తనకు బట్టలు ఉతకడం రాదు కాని అంట్లు తోవడం మటుకు తనకు బాగా ఇష్టమని చెపుతూ ఎవ్వరు తిన్న ప్లేట్లు వాళ్ళే కడుక్కుంటే అందులో చాల ఆనందం ఉంటుందని అలా ప్రవర్తించడం వల్ల మనలోని కొన్ని మలినాలు నయమవుతాయని ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది మంచు వారి అమ్మాయి. ఇంతకీ సినిమాలు మానేసి మోహన్ బాబు ఇంట్లో కిచెన్ కే అంకితమవుతుందేమో రాబోయే రోజులలో తెలుస్తుంది. ఈ విషయం పై మంచు మోహన్ బాబుగారు ఏమంటారో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: