ఎన్నికలు అయిపోయి మరో నలబై ఎనిమిది గంటలలో ఫలితాలు వెల్లడి అవుతున్న నేపధ్యంలో పవన్ కు కొన్ని పరిస్థుతులు ప్రశ్నలుగా మారాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రచారం చేసిన మోడీ ప్రధాని పీఠం ఎక్కడం ఖాయం అని తేలిపోయింది. సీమాంధ్రలో కూడ పవన్ సపోర్టు చేసిన తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం అనే పరిస్థుతులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థుతులలో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వాలపై ప్రజల మోజు తీరాలి అంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటిదాకా అటు మోడీ ఇటు బాబు ప్రజలకు యిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారా లేదా అన్న విషయం పై క్లారిటీ రాదు. అప్పటి దాకా ‘జనసేన’ పార్టీ పెట్టిన పవన్ కు మాట్లాడటానికి ఆయుధాలే దొరకవు. దీనితో ఒక విచిత్రమైన రాజకీయ నిశబ్ధం పవన్ వైపు నుంచి ఏర్పడుతుంది అన్నది వాస్తవం. ఈ గ్యాప్ లో ప్రజల వద్దకు ఏ విషయం పై తన జనసేనను తీసుకువెళతాడు అనే ఆశక్తి అందరిలోనూ ఉంది. అందరు అనుకుంటున్నట్లుగా ప్రధానిగా మోడీ విజయవంతం అయితే భవిష్యత్తులో ప్రజలలోకి రావడానికి పవన్ దగ్గర అస్త్రాలు కూడ ఉండవు.  అటువంటి పరిస్థుతులలో ‘జనసేన’ ఉనికి కాపాడటం పవన్ కు తలకు మించిన సమస్య అవుతుంది. ఇదే పరిస్థితి గత ఎన్నికల తరువాత చిరంజీవికి ఎదురై విధిలేక కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసిపోయాడు. ఇప్పుడు పవన్ కూడ తన జనసేన ఉనికిని పరిస్థుతులకు ఎదురీది నిలుపుకుంటాడ లేదంటే మోడీ గాలిలో రాబోతున్న కాలంలో జనసేన కలిసి పోతుందా అనే ప్రశ్నలకు ప్రస్తుతం పవన్ దగ్గర కూడ సమాధానాలు లేవు అనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: