నేటి తరం హీరోయిన్ల స్పీడ్ ముందు దర్శక నిర్మాతలు కూడ ఖంగారు పడిపోతున్నారు. అదనంగా డబ్బు ఇస్తే చాలు ఎటువంటి హాట్ సీన్స్ కు అయినా రెడీ చెప్పేస్తున్నారు. ప్రస్తుతం అన్నియూత్ సినిమాలలోను లిప్ లాక్ సీన్లు ఉంటున్నాయి. అందుకే అవకాశాలు వస్తే చాలు లిప్‌లాక్‌లకు నేటి తరం హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కాకపోతే వాటికంటూ ఒక రేటును డిమాండ్ చేస్తున్నారంతే. తాజాగా ఈ తరహా వ్యాపారంలో నటి లక్ష్మీ మీనన్ ముందంజలో ఉంది అనే టాక్ కోలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తోంది. ‘కుంకీ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ భామ ఆ చిత్రంలో ఒంటినిండా దుస్తులు ధరించి కొండ ప్రాంత పడుచుగా నిండుగా కనిపించింది. అదే సమయంలో కుంకీ చిత్రం విజయం సాధించడంతో కోలీవుడ్‌కు మరో మంచి హీరోయిన్ లభించిందనుకున్నారు. అనుకున్నట్లుగానే లక్ష్మీ మీనన్ తదుపరి చిత్రాలు సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు చిత్రాల్లోనూ లంగా ఓణి, చీరలతో సంప్రదాయ బద్దంగా కనిపించింది. అయితే అన్ని చిత్రాల్లో లంగా ఓణిలను అంటిపెట్టుకుని సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ మడికట్టుకుని ఉంటే ప్రస్తుత రేస్ లో నిలబడటం కష్టం అనుకుందో ఏమో తెలియదు కాని ఆ తరువాత ఆమె నటించిన నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లోనే రెచ్చిపోయి నటిoచింది. అంతేకాదు హాట్ సీన్స్ లో నటించడానికి కూడా ఓకె చెప్పేసింది. అయితే ఈవార్తతో సంబర పడిపోతున్న నిర్మాతలకు మాత్రం ఈ హీరోయిన్ తల్లి చెప్పిన మాటలు మైండ్ బ్లాంక్ చేసాయట. దీనికి కారణం ఈ హీరోయిన్ తల్లి ఒకొక్క లిప్ లాక్ కు కేవలం పది లక్షలు పారితోషికం అదనం అంటు నిర్మాతలను పిండేస్తోంది అని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: