సినిమాలలో స్టంట్ సీన్స్ చక్కగా ఎసి ధియేటర్లలో కూర్చుని ఫైట్ సీన్స్ చూస్తున్న ప్రేక్షకులకు ఆ సన్నివేశాల చిత్రీకరణ వెనుక ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులు పడే పాట్లు చాల కొద్దిమందికి మాత్రమే తెలుస్తాయి. అత్యుత్సాహంతో నటీనటులు చేసే చిన్నచిన్న పొరపాట్లు వారి ప్రాణం పైకి తీసుకు వస్తూ ఉంటాయి.  ఇటువంటి ఒక విచిత్ర సంఘటన బాలీవుడ్ సినిమా ‘ఏక్ విలన్’ సినిమా షూటింగులో జరిగింది. ఇక వివరాలలోకి వెళితే ప్రధాన తారాగణమైన శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ పాల్గొనే కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మోహిత్ సూరి. ఈ షూటింగ్ నిమిత్తం అవసరార్థం కొన్ని నకిలీ ఆయుధాలను కూడా తెప్పించారు.  అయితే ఆ నకిలీ ఆయుధాల మధ్య నిజమైన ఆయుధం కూడా ఒకటి ఉంది. అది తెలీని శ్రద్ధాకపూర్ ఆ నిజమైన ఆయుధాన్నే చేతిలో పట్టుకొని, ఎదురుగా ఉన్న స్టంట్‌మేన్‌తో సరదాగా యుద్ధ విన్యాసం చేయడం మొదలుపెట్టింది. అది నకిలీ ఆయుధమే అనుకొని ఆ స్టంట్‌మెన్‌ని గట్టిగా పొడిచేసింది.  దానితో షూటింగ్ స్పాట్ లో తీవ్ర గందరగోళం ఏర్పడి రక్తం మధ్య ఉన్న తీవ్రంగా గాయపడ్డ ఆ స్టంట్‌మేన్‌ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.  అదృష్టం ఆ వ్యక్తి బ్రతికాడు కాబట్టి సరిపోయింది కాని లేకుంటే జైలుపాలు అయి ఉండేది శ్రద్దా కపూర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: