టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన కలర్ స్వాతి ఇక నుండి ఓ ఇంటి కోడలుగా మారబోతుందనే టాక్స్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కలర్ స్వాతి లవ్ మేటర్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కలర్ స్వాతి గత మూడు సంవత్సరాలుగా ఓ వ్యక్తితో లవ్ లో ఉన్నదనే వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ న్యూస్ పై క్లారిఫికేషన్ కోసం కోలీవుడ్ మీడియా కలర్ స్వాతిను అడగగా, అలాంటిదేమి లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చుకుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే త్వరలోనే కలర్ స్వాతి మ్యారేజ్ ఉండబోతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. కలర్ స్వాతికి టాలీవుడ్ కంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఆధరణ ఉంది. అలాగే డిమాండ్ కూడ కోలీవుడ్ లోనే ఎక్కువుగా ఉంది. గత అయిదు సంవత్సరాలుగా కలర్ స్వాతి కోలీవుడ్ ఇండస్ట్రీలోనే అవకాశాల కోసం పాగా వేసింది. కలర్ స్వాతి చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఫలంగా తను ఊహించిన దాని కంటే ఎక్కువ అవశాలే వచ్చాయి. అలాగే చెన్నైకు చెందిన నగల వ్యాపారితో కలర్ స్వాతి ప్రేమాయణం ను నడుపుతుందని కోలీవుడ్ మీడియా వార్తలను టెలికాస్ట్ చేసింది. ఇప్పుడు అదే వ్యాపార వేత్తతో కలర్ స్వాతి పెళ్ళికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై కలర్ స్వాతి తొందరగా టంగ్ స్లిప్ అవ్వకుడదని తెగ జాగ్రత్తపడుతుంది. ఎందుకంటే ఒకవేళ సీన్ రివర్స్ అయితే, ఈ మొత్తం వ్యవహారంతో తనకు నష్టం చేకూర్చవచ్చని, అలాగే సినీ అవకాశాలు కూడ తగ్గిపోవచ్చనే ఆలోచనలు చేస్తుంది. మొత్తానికి మరో రెండు, మూడు నెలల్లోనే ఈ తతంగం బయటకు తెలియటం ఖాయం అని అంటున్నారు. కలర్ స్వాతి పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్టేనా? లేనట్టా? ఈ టాపిక్ పై మీకామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: