పట్టుమని పది సినిమాలు కూడ తీయని దర్శకుడు సుకుమార్ పై జాతీయ స్థాయి దర్శకుడు మణిరత్నం కోపం పెంచుకున్నాడు అంటే ఎవరు నమ్మరు. కాని ప్రస్తుతం సుకుమార్ వల్ల మణిరత్నానికి అవకాశం పోయింది అనే మాటలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. నాగార్జున, మహేష్‌బాబు హీరోలుగా మణిరత్నం తీయబోయే మల్టీస్టారర్‌ నుండి కధ తయారు అయి హీరోయిన్స్ ఎంపిక కూడ పూర్తి అయిన తరువాత ఆఖరి నిముషంలో మహేష్ మణిరత్నానికి హ్యాండ్ ఇవ్వడానికి సుకుమార్ కారణం అని అంటున్నారు. తెలుగు తెరకు ఒక విభిన్న చిత్రంగా సుకుమార్ తీసిన ‘వన్’ సినిమా పరాజయంతో మరొక విభిన్న ప్రయోగాత్మక చిత్రంగా మణిరత్నం తీసే సినిమాలో తాను నటిస్తే అసలుకే మోసం వస్తుంది అన్న ఉద్దేశ్యంతో కధ వంకతో ఆ పాత్ర తనకు సూట్ కాదని మహేష్ తప్పుకోవడం వెనుక ఇప్పటికీ మరిచిపోలేని ‘వన్’ సినిమా పరాభవమే అని అంటున్నారు. మణిరత్నం చెప్పిన కధలో హీరో పాత్ర కన్నా విలన్ లక్షణాలతో ఉన్న హీరోయిన్ పాత్ర విషయాన్ని మణిరత్నం నుండి వినగానే మహేష్ బాబు బెదిరిపోయాదట. మహేష్ తప్పు కోవడంతో తనకు ‘గీతాంజలి’ లాంటి సూపర్ హిట్ యిచ్చినా ఆ విషయాన్ని మరిచిపోయి నాగర్జున కూడా ఈ సినిమా నుండి తప్పుకోవడం మణిరత్నానికి కోలుకోలేని షాక్ ఇవ్వడమే కాకుండా ఈ సమస్య అంతా సుకుమార్ వల్ల వచ్చింది అని కోపంగా ఉన్నాడు అంటు మణిరత్నం పై సెటైర్లు పడుతున్నాయి. దీనితో విసికిపోయిన మణిరత్నం కొత్త వారితో మరో సినిమా తీసే పనిలో బిజీగా ఉన్నట్టు కోలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: