టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనేది ఒకటి ఉందంటే అది కచ్ఛితంగా మెగా స్టార్ చిరంజీవి కారణంగానే అనేది అందరూ విశ్వసించదగ్గ నిజం. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో హీరోలందరూ ఒకే తాటిపై లేరు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్, చిరంజీవిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. పవన్ కళ్యాణ్ టిడిపి,బిజెపి పార్టీలకు ప్రచారం చేస్తుండగా, అన్న చిరంజీవి కాంగ్రేజ్ పార్టీను తన భుజాలపై వేసుకుని బోల్తా పడ్డాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రేస్ పార్టీకి ఫ్యూచర్ లేకుండా పోయింది. అలాగే చిరంజీవికి పొలిటికల్ కెరీర్ లేకుండా పోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బాగా నష్టపోయింది చిరంజీవి పొలిటికల్ కెరీర్. దీన్ని గమనించిన చిరంజీవి తన పొలిటికల్ అలాగే గ్లామర్ కెరీర్ ను తిరిగి ఫాంలోకి తెచ్చుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ముఖ్యంగా తను చేయాల్సింది తమ్ముడు పవన్ కళ్యాణ్ తో రాజీ పడటమే. టాలీవుడ్ లో వినిపిస్తున్న క్లియర్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మరి కొద్ది రోజుల్లో చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కి తనకి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్ఫర్ధలను తొలగించుకొని, ఇద్దరూ కలిసి ఒకే తాటిపై నడవటానికి ప్రయత్నాలు చేయాలని చిరు మెగా ప్లాన్ వేస్తున్నాడు. అయితే భవిష్యత్ లో ఈ ఇద్దరి మెగా హీరోలు కలిస్తే మెగా అభిమానులకు పుల్ హ్యాపీ. అయితే పొలిటికల్ గా అన్న సిద్ధాంతం వేరు, తమ్ముడి సిద్ధాంతం వేరు. వీరిద్దరిది ఒకే రక్తమైనప్పటికీ పొలిటికల్ గా కలిసి పనిచేయడం అనేది పవన్ వల్ల కాని విషయం. ఇద్దరి మధ్య ఉన్న గొడవలు రాజీ పడవచ్చు కాని, పొలిటికల్ మాత్రం ఇద్దరూ వేరుగానే ఉంటారు అని టాలీవుడ్ అంటుంది. మొత్తంగా అన్నదమ్ముల రాజీ వ్యవహారం టాలీవుడ్ తో పాటు, పొలిటికల్ గానూ ఆసక్తిను రేకెత్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: