సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని హీరోలు, హీరోయిన్‌లు ఎదురు చూస్తుంటారు. కాని కెరీర్‌ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో వచ్చిన అవకాశాలను వద్దు అనుకుంటే వారిని ఏం అనాలి. వారికి పోయే కాలం దాపరించిందనే అనాలి. ఎందుకంటే అసలే అవకాశాలు లేకుండా చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ నెట్టుకు వస్తున్న వారు బడా హీరోతో సినిమా అవకాశం వద్దు అనుకుంటే వారికి పోయే కాలం వచ్చిందనడంలో అతి శయోక్తి ఏం ఉండదు. తాజాగా ఇదే పరిస్థితి సీతమ్మ అంజలికి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగమ్మాయి అయినప్పటికి తమిళ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ చిత్రల తర్వాత ఈ అమ్మడికి తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె’ చెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, టాలీవుడ్‌లో సీతమ్మగా స్థిరపడిరది. అయితే ఈ ముద్దుగుమ్మ వరుసగా టాలీవుడ్‌ సినిమాల్లో చేస్తున్న సమయంలో పిన్ని భారతితో వివాదం పెట్టుకుని, మీడియాలో రచ్చ రచ్చ చేసి సినిమాల్లో అవకాశాలు రాకుండా చేసుకుంది. ఆ వివాదం అయిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ చిన్న చిన్నగా కెరీర్‌ను స్టార్‌ చేసే అవకాశం ఉంది. ఈ అమ్మడికి వచ్చిన గుర్తింపుతో మళ్లీ స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ అమ్మడు మాత్రం అన్ని సినిమాలకు, అందరు హీరోలకు ఓకే చెప్పకుండా అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ అమ్మడు తాజాగా బాలకృష్ణకు కూడా నో చెప్పింది. ప్రస్తుతం ‘గీతాంజలి’ అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రం తర్వాత తానో స్టార్‌ హీరోయిన్‌ను అయిపోతాను అనే భమ్రలో ఉంది. ‘అరుందతి’ అనుష్కకు ఎంతటి క్రేజ్‌ తెచ్చిపెట్టిందో ఈ చిత్రం కూడా తనకు అంత పేరు తెచ్చి పెడుతుందని, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది. అందుకే ఈ అమ్మడు ఏ చిత్రం వచ్చినా కూడా దానికి నో చెబుతోంది. ఏ స్టార్‌ హీరో అయినా మొహమాటం లేకుండా స్వారీ చెబుతోంది. బాలకృష్ణ త్వరలో నటించబోయే చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ కావాల్సి ఉంది. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్‌గా అంజలిని, మరో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు భావించారు. కాని తాను బాలయ్యతో నటించను అని వారి మొహం మీదే చెప్పి, వారికే షాకÊ ఇచ్చింది. ప్రస్తుతం తనకు డేట్లు ఖాలీ లేవు అని చెప్పింది. ఈమె చేసే ఒక్క సినిమాకు డేట్లు ఖాలీ లేవా? ఈమెకు ఏం చూసుకుని ఇంత తల పొగరు. అంటూ వారు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. అంజలిని ఒక నిర్మాత వెనుక ఉండి నడిపిస్తున్నాడు అని, ఆయన ఆదేశాలు, సూచనల మేరకు అంజలి నడుచుకుంటుందని సినీ వర్గాల్లో టాక్‌. అనుష్కలాగా అంజలి కూడా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఫేమస్‌ అయ్యేలా ఆ నిర్మాత చేస్తాను అని అంజలికి మాట ఇచ్చాడట. అందుకే అంజలి ‘గీతాంజలి’ చిత్రం తర్వాత మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించనుంది. ఇలా దారిన పోయే వారి మాటలు నమ్మి, అంజలి తన కెరీర్‌ను నాశనం చేసుకుంటుందని, ఇలాగే చేస్తే, వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటే అంజలికి పోయేకాలం వస్తుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. --

మరింత సమాచారం తెలుసుకోండి: