టాలీవుడ్ స్టార్ హీరయిన్ సమంత అంటే తోటి హీరోయిన్స్ కి కొద్దిగా ఒళ్ళుమంటగా ఉంటుంది. అంతే కాకుండా చిన్న హీరోయిన్స్ కు వచ్చే అవకాశాలన్ని కూడ స్టార్ హీరోయిన్ చేజిక్కించుకుంటుంటే వారికి మరింత మండుతుంది. ఆ విధంగా సమంతని ఓ చోటా హీరోయిన్ టార్గెట్ చేసుకుంది. కేవలం అంతటితో వదిలేయకుండా తనకే స్టార్ హీరోయిన్ హోదా వస్తే సమంత లెక్కేంటో తేలుస్తా అంటుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అందాల రాక్షసి మూవీతో తెలుగులోకి ఎంట్రి ఇచ్చిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి తాజాగా మనం మూవీలో గెస్ట్ రోల్ ను చేసింది. చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికీ తన ఫీలింగ్ మాత్రం మెయిన్ హీరోయిన్ ను మించి ఉంది. నిజానికి ఆ మూవీలో నాగార్జున సరసన నటించాల్సింది, కాని చివరి నిముషంలో గెస్ట్ రోల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరితోనూ ఈ న్యూస్ ని హైలెట్ చేసుకుంటూ చెబుతుంది. అయితే లావణ్య త్రిపాఠి చెబుతున్న దాంట్లో ఏ మాత్రం నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలకు తెలిసినా, ఈ బ్యూటి చెప్పుకునే గొప్పలు వినటానికి బాగున్నాయని వింటున్నారంట. అయితే త్వరలోనే లావణ్య త్రిపాఠి, నాగార్జున అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ అంటుంది. అయితే మనం మూవీలో మాత్రం సమంత కంటే తనే అందంగానూ, అందరి హీరోయిన్స్ కంటే తనే బాగా నటించానని చెప్పుకుంటుంది. మూవీ రిలీజ్ అయిన తరువాత కాని లావణ్య త్రిపాఠి చేసిన రోల్ తెలియదు, అప్పుటి వరకూ తనను కామెంట్ చేయకుండా ఉంటేనే బెటర్ అని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: