కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఓ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న బ్లాక్ బ్యూటీ, అమలాపాల్. అమలాపాల్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డం ను సంపాదించుకుంది. అంతే కాకుండా స్టార్ హీరోలతోనూ అవకాశాలను దక్కించుకొని నటించింది. ఆ విధంగా అమలాపాల్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతున్న సమయంలో, ఎవ్వరూ ఊహించనంతగా తన పెళ్ళి వార్తను ఫైనల్ చేసి అందరికి చెప్సేసింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ కెరీర్ ఊపందుకుంటుంటే అప్పుడే పెళ్ళి ఏంటి అని అమలాపాల్ ను అడిగితే, నేను సాధారణ మహిళనే అంటూ తన కాబోయో భర్త గురించి గొప్పలు చెప్పటం మొదలు పెడుతుంది. ఇదిలా ఉంటే అమలాపాల్ తన భర్తకు ఓ బంపర్ ఆఫర్ ని ఇచ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం అమలాపాల్ ఎటువంటి మూవీలను ఒప్పుకోవడం లేదు. అలాగే తన ముందు ఉన్న ప్రాజెక్ట్స్ ను సైతం క్యాన్సిల్ చేసుకుంటుంది. అలాగే తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి ఇవ్వటానికైనా సిద్ధంగా ఉంది. ఇదంతా ఎందుకంటే మరి కొద్ది రోజుల్లోనే అమలాపాల్ పెళ్ళి ఉండటంతో, తన కాబోయో భర్తతో ఎక్కువ సమయాన్ని గడపటానికి తను ఇష్టపడుతుందట. అందుకే తను ఎటువంటి మూవీలను ఒప్పుకోవడం లేదని చెబుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అమలాపాల్ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. కొంత మంది దర్శకులు, రచయితలు అమపాల్ కు సెట్ అయ్యే పవర్ ఫుల్ కథలను తీసుకువస్తున్నారంట. అయితే అమలాపాల్ మాత్రం తను ఎటువంటి కథలను వినను అని అంటుంది. అయితే తెలివిగా, తన దగ్గరుకు వస్తున్న రచయితలకు మాత్రం ఓ మంచి కథ ఉంటే తప్పకుండా ఆలోచిస్తాను అని అంటుంది. అంతే కాకుండా అమలాపాల్ కి కథను చెప్పాలంటే ముందుగా తన భర్త విజయ్ కి దాన్ని చెప్పాల్సిందిగా కోరింది. పెళ్ళి తరువాత తను చేయబోతున్న మూవీలకు విజయ్ కీలకంగా ఉంటాడని కూడ చెప్పుకొచ్చింది. మొత్తంగా అమలాపాల్ తన భర్తకి భలే బంపర్ ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: