టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ నాలుగు మూవీల్లో చిన్న పాటి పాత్రలను చేసిన యాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. అలాగే పలు సీరియల్స్ లోనూ కళ్యాణ్ చక్రవర్తి నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయమే ఈ వర్ధమాన నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న బుల్లితెర ఇండస్ట్రీ, అలాగే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన నటుడు. యాక్టింగ్ మీద కోరికతో ఫిల్మ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన కళ్యాణ్ చక్రవర్తి తరువాత సీరియల్స్ లో అవకాశాలు రావడంతో బుల్లితెరలోనే తన యాక్టింగ్ కెరీర్ ను మొదలు పెట్టాడు. తరువాత పలు సీరియల్స్ నటిస్తూ, కొన్ని మూవీల్లోనూ కొద్ది పాటి పాత్రలను చేశాడు. అయితే ప్రస్తుతం ఇంటి వద్దనే కళ్యాణ చక్రవర్తి, ఉదయం ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు లేవనెత్తున్నాయి. కళ్యాణ చక్రవర్తికి ఆర్ధిక ఇబ్బందులు ఉండటంతోనే తను ఈ విధంగా సుసైడ్ కి పాల్పడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ ఉదంతంపై పోలీసులు లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి తల్లి రిటైర్డ్ మండల రెవెన్యూ ఆఫిసర్. గత కొంత కాలంగా కళ్యాణ చక్రవర్తి కొద్దిగా మూడీగా ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే తను ఆత్మహత్య చేసుకునేంత నిర్ణయాన్ని తీసుకునే మనస్తత్వం కాదని కూడ సన్నిహితులు అంటున్నారు. మొత్తంగా కళ్యాణ్ చక్రవర్తి సుసైడ్ మిస్టరిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: