టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబవర్ హీరో అంటే దాదాపు మహేష్ బాబు అనే చెప్పవచ్చు. మొన్నటి వరకూ నెంబర్ వన్ రేసులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు దాదాపు దూరం కాబోతున్నాడు. దీంతో మహేష్ బాబు పూర్తిగా నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు నెంబర్ వన్ హీరో మాత్రమే కాకుండా, రెమ్యునరేషన్ విషయంలోనూ టాప్ పోజిషన్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కో మూవీకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ దాదాపు ఇరవై కోట్ల రూపాయలను టచ్ అవుతుంది. ఈ ఫిగర్ ను చూసిన నిర్మాతలు ఒక్కోసారిగా షాక్ అవుతున్నారు. మూవీకు వచ్చే లాభాలు పక్కన పెడితే, దాదాపు వీరికి నష్టాలే ఎక్కువుగా వస్తున్నాయి. దీంతో నిర్మాతలు మహేష్ బాబు అప్ కమింగ్ మూవీస్ లో రెమ్యునరేషన్ ను తగ్గించుకోమని చెప్పాలనుకుంటున్నారంట. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అందుకు రీసెంట్ గా ఓ ప్రొడ్యూజర్ మహేష్ బాబుకి కథనె చెబితే అందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఇద్దరి మధ్య క్లారిటి రాలేదంట. మహేష్ మూవీకు ఇరవై కోట్ల రూపాయల వరకూ అడితే అందుకు నిర్మాత 15 కోట్ల రూపాయలకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడంట. అయితే ఈ ఇలా ఒక్క నిర్మాత మాత్రమే కాకుండా మరో ఇద్దరు నిర్మాతలు కూడ మహేష్ తో ఈ విధంగా మాట్లాడారంట. దీంతో మహేష్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు చేతిలో రెండు మూవీలు ఉన్నాయి. వాటికి దాదాపు 18 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తరువాత ఒప్పుకునే చిత్రాలకు మాత్రం పదిహేను నుండి పదిహేడు కోట్ల రూపాయలకే రెమ్యునరేషన్ ఉండొచ్చని టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: