ప్రస్తుతం పవన్ నీడలా పివిపి వెంచర్స్ అధినేత పోట్లురి వరప్రసాద్ వ్యవహరిస్తున్న సంగతి ఓపెన్ సీక్రెట్. పవన్ జనసేన పార్టీ వ్యవహారాలలో అన్నింటా తానై వ్యవహరించాడు పొట్లూరి. అటువంటి వ్యక్తి ఆద్వర్యంలో నిర్వహింప బడుతున్న ప్రముఖ వ్యాపార సంస్థ పివిపి వెంచర్స్ లో పవన్ కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పదవి ప్రసాద్ కట్ట బెట్ట బోతున్నాడు అని వ్యాపార వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని 8 పట్టణాలలో హైటెక్ సిటీలు అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ కు, చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యంతో ఆ హైటెక్ సిటీల నిర్మాణం కాంట్రాక్టులను తన పివిపి వెంచర్స్ సంస్థకు సంపాదించే ఎత్తుగడలో భాగంగానే పివిపి అధినేత ప్రసాద్ పవన్ పై ఈ స్కెచ్ వేస్తున్నాడు అని అనుకోవాలి.  పవన్ డైరెక్టర్ గా పివిపి సంస్థలో చేరితే ప్రస్తుతం పవన్ కు ఉన్న పాపులారిటి రీత్యా తన సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది అనే ఆలోచన కూడ ఈ సంస్థ అధినేత ప్రసాద్ కు ఉంది అని అంటారు. కానీ తనకు కోట్లు కురిపించే సినిమాలనే కాదనుకుని అడుగులు వేస్తున్న పవన్ పివిపి ఎత్తుగడలో పావు గా మారుతాడా అన్నదే ప్రశ్న?  

మరింత సమాచారం తెలుసుకోండి: