టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ పొజిషన్ ను చేజిక్కించుకున్న యాక్టర్ చిరంజీవి. అయితే చిరంజీవి అభిమానుల కోరిక మేరకు రాజకీయాలలోకి వచ్చి, అధికారాన్ని మాత్రం చేజిక్కించుకోలేక పోయాడు. అలాగే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీను చూసుకుంటే ప్రతి సంవంత్సరం అంచెలంచెలుగా పూర్తిగా దిగజారుకుంటూ పడిపోయింది. ఇప్పుడు చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టి కాదు కదా, తన పార్టిను విలీనం చేసుకున్న కాంగ్రేస్ పార్టి కూడ అధికారంలో లేకుండా పోయింది. దీంతో చిరంజీవి కి రాజకీయ భవితవ్యం దాదాపు లేనట్టే అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవిని ఓ యంగ్ యాక్టర్ అవమానించాడంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించని సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం మెగా చిరంజీవిను టాలీవుడ్ యంగ్ హీరో కామెంట్ చేశాడు. చిరంజీవి ఇక సీరియల్స్ లోనూ, రియాలిటి షోలలోనూ యాక్ట్ చేయాల్సిందే. మూవీల్లోనూ చిరుకి స్టార్ డం తగ్గిపోయిందంటూ కామెంట్ విసిరాడు. ఈ కామెంట్ విసిరింది ఎవరో కాదు. తెలుగు దేశం పార్టీకు సపోర్ట్ గా ఉంటున్న వర్ధమాన నటుడిగా పేరు వినిపిస్తుంది. అయితే ప్రస్తుత సమాచారం మేరం చిరంజీవి త్వరలోనే ఓ రియాలిటి షోకి హోస్ట్ గా బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉందని అంటున్నారు. నాగార్జున ఇప్పటికే లక్షాధికారి అనే రియాలిటి షో లో హోస్ట్ గా చేస్తున్నాడు. నాగార్జునని ఆదర్శంగా తీసుకునే చిరంజీవి సైతం రియాలిటి షోలకు ఆసక్తి చూపుతున్నాడని టాలీవుడ్ టాక్. మొత్తంగా ఆ యంగ్ యాక్టర్ చేసిన కామెంట్స్ మాత్రం, ఇప్పుడు టాలీవుడ్ లో వెరీ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి రాజకీయం భవితవ్యం ఘోరంగా వైఫల్యం చెందటంతో, చిరుపై ఇటువంటి కామెంట్స్ జోరుగా వస్తున్నాయి. వీటికి చిరు ఏ విధంగా సమాధానం ఇస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: