హీరోల‌కి అందం ఆక‌ర్ష‌ణ మాత్ర‌మే! కాని, హీరోయిన్ల‌కి అందం... ఆయుధం లాంటిది! దానితోనే వాళ్లు గ్లామ‌ర్ వార్స్ విన్న‌వుతుంటారు. ఇక అందం ఎంత వున్నా ఫ్యాష‌న్ సెన్స్ లేక‌పోతే... అది మ‌రో పెద్ద లోపంగా మిగిలిపోతుంది! ఈ విష‌యం బాగా తెలుసు కాబ‌ట్టే ప్రెజెంట్ బాలీవుడ్ హీరోయిన్స్ బ్యూటీ అండ్ ఫ్యాష‌న్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. మ‌రి వాళ్ల‌లో మ‌న ఫ్యాష‌నిస్టా... సోన‌మ్ క‌పూర్ గురించి చెప్పేదేముంది? తాజాగా మ‌రోసారి కాన్స్ రెడ్ కార్పెట్ పై అందర్నీ హీటెక్కించింది. దీనికి సంబంధించని సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సోన‌మ్ త‌న సొగ‌సుల‌తో క్రేజ్ త‌గ్గ‌కుండా చూసుకుంటూ వ‌చ్చింది! ఫైన‌ల్ గా గత సంవత్సరం రాంజ్నా, భాగ్ మిల్కా భాగ్ ల‌తో స‌క్సెస్ కూడా కొట్టింది. కెరీర్ విష‌యం ఎలా వున్నా... ది ఫ్యాష‌న్ గాడెస్... సోన‌మ్ క‌పూర్ స్టైల్ స్టేట్మెంట్ మాత్రం ఎప్పుడూ టాక్ అఫ్ ది ఇండ‌స్ట్రీనే! పైగా ఫ్యాష‌న్ క్యాపిట‌ల్ ప్యారిస్ లో జ‌రిగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అయితే.. ఆమెని మ‌రింత సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా మార్చేస్తుంది! గ‌తంలో లాగే ఈ సారి కూడా సోన‌మ్ క‌పూర్ రెడ్ కార్పెట్ పై డెడ్లీ లుక్స్ ఇచ్చింది.  ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ఫ్లాష్ ల మ‌ధ్య భార‌తీయ అందంతో హొయ‌లుపోయింది! లాంగ్ వెస్టన్ డ్రెస్ లో లావాను వెద‌జల్లింది! కాన్స్ కి భార‌తీయ అంద‌గ‌త్తెలు క్యూ క‌ట్ట‌డం ఈ సారే కాదు ప్ర‌తీ సారి జ‌రిగేదే. సోన‌మ్ కూడా గ‌త కొన్ని కాన్స్ ఈవెంట్స్ కి లారియ‌ల్ ప్ర‌తినిధిగా ప్ర‌త్యేకంగా హాజ‌రైంది. ఇక మోస్ట్ బ్యూటీఫుల్ ఇండియ‌న్ వుమ‌న్.. ఐశ్వ‌ర్య కూడా రెగ్యుల‌ర్ గా ఇక్క‌డ సంచ‌ల‌నం సృష్టిస్తుంది. అలాగే స్ల‌మ్ డాగ్ స్లిమ్ బ్యూటీ ఫ్రిడా పింటో కూడా అగ్గి రాజేస్తూ వుంటుంది! విద్యా బాల‌న్, నందితా దాస్ నుంచి మ‌ల్లికా షెరావ‌త్ వ‌ర‌కూ కాన్స్ లో క‌ళ‌క‌ళలాడిన వారు చాలా మందే. అయితే... ఫ్యాష‌న్ విష‌యంలో మాత్రం సోన‌మ్ ని ఎవ్వ‌రూ బీట్ చేయ‌లేక‌పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: