ప్రస్తుతం చంద్రబాబు నవ్వు గురుంచి ఆశ్చర్యపోతు మీడియా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తోంది. దీనికి కారణం చంద్రబాబు సామాన్యంగా నవ్వరు. ఆయన గత పది సంవత్సరాలుగా నవ్విన సందర్భాలు చాల అరుదు. అలాంటి చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వచ్చాక రోజుకి ఎన్ని సార్లు నవ్వుతున్నారో ఆయనకే లెక్కలేదు అని అంటున్నారు. ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత చంద్రబాబు ఇంటికి సినిమా తారలంతా అభినందనలు తెలపడానికి క్యూ కడుతున్నారు. ఈ లిస్టులో తాను చేరిపోవాలని యంగ్ హీరో రామ్ కూడ చంద్రబాబును కలిసి అభినందించాడట. రామ్ కుటుంబ సభ్యులు స్రవంతి రవికిషోర్ తదితర వ్యక్తులంతా చంద్రబాబుకు బాగా సన్నిహితులు కావడంతో బాబు తనను అభినందించడానికి వచ్చిన రామ్ వంక చూసి ఏమి సినిమాలు చేస్తున్నావు అని అడిగారట. దానికి రామ్ ‘పండగ చేస్కో’ అనే సినిమా చేస్తున్నాను అని చెప్పే సరికి చంద్రబాబు గట్టిగా నవ్వుతూ ఇప్పటి సీమాంధ్ర ప్రదేశ్ పరిస్థుతులకు తగ్గట్టుగా మంచి టైటిల్ పెట్టుకున్నావు అంటూ మెచ్చుకోవడమే కాకుండా ఇక తాను అధికారంలోకి రావడంతో సీమాంధ్ర ప్రజలకు ప్రతిరోజూ పండుగే అంటూ గుక్క తిప్పుకోకుండా రామ్ ఎదుట చంద్రబాబు ఉపన్యాసం అందుకునేసరికి పాపం రామ్ కు కూడా తన సినిమా టైటిల్ చంద్రబాబుకు ఎందుకు చెప్పానా అని ఖంగారు పడ్డాడట. ఏమైనా చంద్రబాబు దరహాసం మాత్రం ఇప్పుడు మీడియాకు మంచి జోష్ నిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: