Brother's Tweet Review || Brother's English Review
అవిభక్త కవలలుగా సూర్య నటించిన సినిమా బ్రదర్స్. గజని సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సూర్య నటించిన ఈ తాజా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రంగం సినిమాతో తనదైన ముద్ర చూపించిన కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించడంతో అంతా ‘బ్రదర్స్’ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ‘బ్రదర్స్’ ఏ విధంగా ఉన్నారో.. చూద్దాం..!  

చిత్రకథ :

  జెనిటిక్ ఇంజనీర్ చేసిన ఒక ప్రయోగం కారణంగా అతనికి ఆవిభక్త కవల పిల్లలు అఖిల్, విమల్ (సూర్య) జన్మిస్తారు. ఇద్దరికీ శరీరాలు వేరైయినా గుండె మాత్రం ఒక్కటే. కాగా, ఈ జెనిటిక్ ఇంజనీర్ తల్లి పాలతో సమానమైన పోషక పదార్థలు కల పాల పౌడర్ ను తయారు చేసి విక్రయిస్తుంటాడు. భారీ లాభాలను సంపాదిస్తుంటాడు. అసలు ఆ పాల పౌడర్ లో ఏముంది..?, జెనిటిక్ ఇంజనీర్ ఏ కారణం చేత ఆ పాల పౌడర్ తయారు చేశాడు.? అనేది చిత్రంలో అసలు కథ. తన తండ్రి చేస్తున్న మోసాలను పిల్లలు ఏలా అడ్డుకున్నారు, అఖిల్ విమల్ లో చివరికి ఎవరు మిగిలారు.. అనేది వెండి తెర మీద చూడాలి.

నటీనటుల ప్రతిభ :

  సూర్య ఈ సినిమాలో చక్కనైన నటన ప్రదర్శించాడు. అతనికి నటన మీద ఎంత మక్కువ ఉందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. రెండు తరహాలకు చెందిన వ్యక్తులుగా బాగా నటించాడు. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. అలాగే అఖిల్ తన నుంచి వేరు పడిన తరవాత విమల్ పాత్రలో సూర్య నటన అద్భుతం. కాజల్ ఈ సినిమాలో ట్రాన్స్ లేటర్ పాత్రలో నటించింది. గత సినిమాల కంటే కాజల్ సినిమాలో చాలా అందంగా కనిపించింది. పాటల్లో తన గ్లామర్ తో అభిమానులను మురిపించింది. సూర్య తండ్రిగా నటించిన నటుడు ఆకట్టుకుంటాడు. మిగిలిన వారు తమతమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

మాటలు యావరేజ్ గా ఉన్నాయి. సంగీతం ఫర్వాలేదు. ఫోటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. కథా ప్రకారం విదేశాలలో ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. ఇక కథ, దర్శకత్వం విషయానికి వస్తే పాత కథనే కొత్తగా చెప్పాడానికి కృషిచేశారు. దుర్మార్గుడైన తండ్రి, ఉత్తముడైన కొడుకు.. ఈ కధాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ బ్రదర్స్ సినిమాకు అవిభక్త కవలలు, విదేశీ నేపథ్యాన్ని జోడించారు. కవల పిల్లలను తల్లి బాధ్యత పెంచడం, అవిభక్త కవల మధ్య సన్నివేశాలను బాగా పండించిన దర్శకుడు చివరికి వచ్చే సరికి చేతులెత్తేసాడు. అనవసర యాక్షన్ సీన్లతో ఈ సినిమా సెకండాఫ్ చాలా బోర్ గా సాగుతుంది. అలాగే హీరోయిన్ పాత్ర విషయంలో కూడా దర్శకుడు శ్రద్ధ తీసుకోలేదు. అన్నదమ్ముల్లో ఒకరిని ప్రేమించి, మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందో అర్ధం కాదు.

హైలెట్స్ :

  సూర్య నటన, కాజల్ గ్లామర్, ఫస్టాఫ్ లో ఆకట్టుకునే కొన్ని సన్నివేశాలు

డ్రాబ్యాక్స్ :

  వినోదం లేకపోవడం, ఆసక్తికరంగా సాగని సెకండాఫ్     

చివరగా :

  ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బ్రదర్స్ దారి తప్పారు.     More Articles on Brothers || Brothers Photos & Wallpapers || Brothers Videos  
 

మరింత సమాచారం తెలుసుకోండి: