2009 సంవత్సరంలో విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగ రాసిన ‘మగధీర’ కలెక్షన్స్ చరిత్రను బ్రేక్ చేయడo ‘అత్తారింటికి దారేది’ విడుదల అయ్యేదాకా ఏ హీరో వల్ల కాలేదు. చివరకు అబ్బాయి రికార్డులను బాబాయ్ బ్రేక్ చేసాడు. అయితే ఈ విషయం పై రకరకాల వాదనలు ఉన్నాయి. అది వేరే విషయం. అయితే ‘మగధీర’ రికార్డును నందమూరి సింహం బాలయ్య బ్రేక్ చేసాడు అంటే ఎవరికైనా ఆశ్చర్యకరమైన విషయమే. కాని ఇది నిజం అని అంటున్నారు, బాలయ్యతో ‘లెజెండ్’ సినిమా తీసిన నిర్మాతలు. వారు తెలుపుతున్న వివరాల ప్రకారం బాలకృష్ణ కెరియర్ లో మెగా హిట్ గా నిలిచినా ‘లెజెండ్’ కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో అప్పటి వరకు రామ్ చరణ్ ‘మగధీర’ పేరుమీద ఉన్న కలెక్షన్స్ రికార్డును క్రాస్ చేసి 42 లక్షలు కలెక్టు చేసి ఆదోని పట్టణంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది అని చెపుతున్నారు.  అంతేకాదునందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసి ఇప్పటి వరకూ నందమూరి హీరోలు ఎవ్వరూ  సాధించలేని రికార్డును  సాధించింది అని ప్రకటించడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. చిరంజీవి రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా బాలకృష్ణ  రామ్ చరణ్ రికార్డును బ్రేక్ చేయడం సంచలనమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: