గ్లామర్ ప్రపంచంలో దక్షిణాది సెక్సీ క్వీన్ గా ఒక వెలుగు వెలిగి దాదాపు 15 సంవత్సరాల క్రితమే రోజుకు రెండు లక్షల పారితోషికాన్ని తీసుకున్న సెక్సీ క్వీన్ షకీలాకు ప్రస్తుతం ఉండడానికి సొంత ఇల్లు కూడ లేదంటే ఎవరు నమ్మరు. ఆమె జీవితానికి సంబందించిన కొన్ని నమ్మలేని నిజాలను ఈరోజు షకీలా ఒక ప్రముఖ పత్రికతో షేర్ చేసుకుంది. షకీలకు పెళ్లికాకపోయినా పెళ్ళి వయసుకు వచ్చిన కొడుకు ఉన్నాడు.  తన తల్లి చనిపోయిన తరువాత ఆర్ధికంగా చితికి పోయిన తనను పట్టించుకునే వారు లేని పరిస్థుతులలో తన దగ్గరకు తంగం అనే అబ్బాయి దేవుడిచ్చిన కొడుకుగా తన దగ్గరకు వచ్చాడని అంతేకాకుండా తనకు ఏ క్షణాన ఏమి కావాలో దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా తనకు అల్లా ఇచ్చిన బిడ్డగా తంగం మారిపోయాడని చెపుతోంది షకీలా.  తాను ఒక వెలుగు వెలిగే రోజులలో తన జీవితంలోకి దాదాపు 20 మంది పురుషులు ఎదురైయ్యారానీ వారంతా తనను ప్రేమించాను అంటూ తనను సర్వ విధాల నాశనం చేయడమే కాకుండా తన డబ్బును కూడా పాడు చేసారని చెపుతోంది షకీలా. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో పేరున్న ఒక హీరో తనతో ఐదేళ్ళు సహజీవనం చేసి తనను మోసం చేసాడనీ అదేవిధంగా తమిళ నాడులో కొత్తగా ఏర్పడిన ఒక హీరో రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖుడు కూడా తనను మోసం చేసాడని అయితే వారందరి విషయాలు త్వరలో బయట పెడతాను అని సవాల్ విసురుతోంది షకీలా.  దీనిని బట్టి చూస్తూ ఉంటే సినిమాలు లేకపోయినా ప్రస్తుతం దర్శకురాలి అవతారం ఎత్తిన షకీలా త్వరలోనే మరికొన్ని సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: