గత కొద్ది కాలంగా జూనియర్ సినిమాలకు మార్కెట్ తగ్గి పోయింది అని విమర్శిస్తున్న విమర్శకులకు జూనియర్ ఇంకా ఆడియో కూడవిడుదల కాని తన ‘రభస’ సినిమా ద్వారా గట్టి సమాధానం ఇస్తున్నాడు. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా టీజర్ యంగ్ టైగర్ అభిమానులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ‘రభస’ సినిమా బిజినెస్ పై కొంత మందికి అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం ప్రకారం రభస ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకుని 42 కోట్లు బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు బెల్లంకొండ 35 కోట్ల రూపాయలతో నిర్మించాడు అని టాక్. ఈ వార్తలే నిజం అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా జూనియర్ క్రేజ్ బెల్లంకొండను రక్షించినట్లే అని అనుకోవాలి. ఈ వార్తలు ఇలా ఉండగా మార్చి 28న రిలీజైన ‘లెజెండ్’ 100 రోజులు పూర్తి చేసుకోనుంది. చాలాకాలం తర్వాత బాలయ్య సినిమా శత దినోత్సవానికి చేరువకావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. జులై 3న హిందూపురంలో ఫంక్షన్‌కు ఏర్పాటు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి గెలవడంతో అక్కడే సంబరాలు జరుపుకోవాలని బాలయ్య కూడా భావిస్తున్నాడట. కలెక్షన్లపరంగా ఇప్పటివరకు యాభై కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్ట్‌గా 25 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకోబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ విషయాలన్నే దృష్టిలో పెట్టుకుని జూనియర్ తన ‘రభస’ సినిమాను ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో సినిమా విడుదల కాని అత్యధిక ధియేటర్లలో విడుదల చేసి బాలయ్య లెజెండ్ ఓపినింగ్ కలెక్షన్స్ ను బ్రేక్ చేయడమే కాకుండా తన ‘రభస’ సినిమాను ప్రతి విషయంలోను బాలయ్య లెజెండ్ రికార్డులను టార్గెట్ చేసేలా వ్యూహాత్మక ఎత్తుగడలు వేయాలని ఇప్పటి నుంచే జూనియర్ ఆలోచిస్తున్నాడు అని ఫిలింనగర్ సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: