యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తాడు అనే స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఈ సినిమాను నిర్మించే ఆలోచలనలో ఉన్నారట. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి' షూటింగులో పాల్గొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈమధ్య బాహుబలి షూటింగ్ చూడటానికి వచ్చిన కృష్ణం రాజు యుద్ధ వీరుడి గెటప్‌లో ప్రభాస్‌ను చూసి చాలా ఆనంద పడ్డాడని అప్పుడే కృష్ణం రాజుకు ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో ప్రభాస్‌ నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది అని అంటున్నారు. టాలీవుడ్ లో 70 ప్రాంతాలలో సీనియర్ ఎన్టీఆర్ ‘అల్లూరి సీతారామరాజు' సినిమా చేయాలని భావిస్తూ ఉంటె అనుకోకుండా సూపర్ స్టార్ కృష్ణ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ అల్లూరి సీతారామరాజును తీసి అందరికి షాక్ ఇచ్చాడు. ఆరోజులలో ఈ సినిమా సూపర్ హిట్.. ఇప్పటికీ బుల్లి తెర పై ఈ సినిమా వస్తే అనేక లక్షల మంది ఈ సినిమాను చూస్తూ ఉంటారు. టాలీవుడ్ క్లాసిక్ మూవీగా పేరుగాంచిన కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ ను ప్రభాస్ హీరోగా నటించడమంటే ఒక సాహసమనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: