టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన శైలితో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. గత కొంత కాలంగా కాజల్ కి సరైన ఆఫర్ రావడంలేదనేది ఇండస్ట్రీ టాక్. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. తన వద్దకు వస్తున్న ఆఫర్స్ కి, తన రెమ్యునరేషన్ ని చెప్పి నిర్మాతలని హడలెత్తించింది. అంతే కాకుండా ఒకానొక దశలో కంటిన్యూస్ షూటింగ్ షెడ్యూల్స్ ఉంటే, వాటన్నింటిని పక్కన పెట్టి చెల్లి నిషా అగర్వాల్ తో ఎంచక్కా ఫారిన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసి వచ్చింది. ఈ విధంగా కాజల్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు కొంత మంది నిర్మాతలు ఇబ్బందులు పడ్డారని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. అయితే కాజల్ ప్రస్తుతం ఒక మూవీలో నటిస్తూ, మరొ మూవీకి తన డేట్స్ ఇచ్చుకుంది. రీసెంట్ ఓ రిపోర్టర్ తనని అడిగిన ప్రశ్నకి, కాజల్ అవాక్కయిందట. అంతే కాకుండా ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి తెగ కంగారు పడిపోయింది. తను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాంలో లేకపోయినప్పటికీ కోటి రూపాయల వరకూ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నగా సమాచారం అని ఆ రిపోర్టర్ అడిగాడట. అందుకు కాజల్ ఇంతవరకూ తనకు రెమ్యునరేషన్‍‌గా ఏ నిర్మాతా కోటి రూపాయలు ఇవ్వలేదని అంటోంది. నిజంగా అంత ఇస్తే కళ్ళకద్దుకొని తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తను రెమ్యునరేషన్ కోసం ఎవర్నీ పీడించను, వేరే భాషలో నటించే సినిమాల డేట్స్ ని బట్టి, అవకాశాన్ని బట్టి నటిస్తా అంటోంది. అయినా కాజల్‌కు ఇంత ఇచ్చాం, ఇలా డిమాండ్ చేస్తోంది అని ఏ నిర్మాతైనా మీతో చెప్పారా అని ఆ జర్నలిస్టును దబాయించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: