ఫలానా హీరోయిన్ తో మీకు ఎఫైర్ ఉందా? అని మీడియా ఏ హీరోను అయినా ప్రశ్నిస్తే ఆ హీరోయిన్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని సమాధానం చెప్పి తప్పించు కుంటారు నేటి యంగ్ హీరోలు అయితే దీనికి విరుద్ధంగా తన పై గాసిప్పులను రాస్తున్న మీడియాను ఆ హీరోయిన్ తో తనకు పెళ్ళి చేసి పెట్టమని సంచలనం చేసాడు ఒక బాలీవుడ్ హీరో. ఇక వివరాలలోకి వెళితే హీరో వరుణ్ ధావన్ హీరోయిన్ అలియా భట్ లు సహజీవనం చేస్తున్నారు అంటూ ఈ మధ్య బాలీవుడ్ మీడియా తెగ రాతలు రాస్తోంది. ఈ మధ్య మీడియా ప్రతినిధులు ‘మీరు అలియా భట్ బాగా క్లోజయ్యారట, పెళ్లి కూడా చేసుకోబోతున్నారట’ అని అడిగారట.  దానికి ఆ యంగ్ హీరో ఏమాత్రం తడుముకోకుండా ‘అలానా అందుకు మరి ఆమె ఒప్పుకుందా? ప్లీజ్ ఆమె కాకపోయినా ఆమెలాంటి మంచి అమ్మాయిని కాస్త వెతికిపెట్టండి మీకు పుణ్యముంటుంది’ అని రివర్స్ పంచ్ ఇచ్చాడట. దీంతో మీడియా ప్రతినిధులకు దిమ్మ తిరిగిందని టాక్. అంతేకాదు తన జీవితంలోకి వచ్చే అమ్మాయి 'హంప్టీ శర్మకీ దుల్హనియా' చిత్రంలోని అలియా భట్ క్యారెక్టర్‌లా వుండాలి అని ఈ యంగ్ హీరో చెపుతూ ఉండటంతో అలియా భట్ తో తన ప్రేమను వరుణ్ ధావన్ ఒప్పుకున్నట్లే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: