ఇది ఒక సినిమాలోని సీన్ కాదు. కోలీవుడ్ హీరో ఒక సినిమా ఫంక్షన్ లో ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతు పతికి మంచినటుడిగా కోలీవుడ్ రంగంలో పేరుంది. ఈ హీరోకి తెలుగులో కూడ ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ హీరో ఈమధ్య నటించిన ఒక సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. నెగిటివ్ షెడ్ తో ఉండే ఆ సినిమా పాత్రలో విజయ్ సేతు పతి అమ్మాయిలను కిడ్నేప్ చేసే నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇతడికి నయనతార అంటే చాల ఇష్టం. ఈమధ్య చెన్నైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న విజయ్ సేతు పతిని ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక యాంకర్ సేతు పతిని ఉద్దేశించి ఆ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్స్ లో ఎవరిని కిడ్నేప్ చేసి అమ్మేస్తారు అని జోక్ గా అడిగితే విజయ్ ఒక్క క్షణం కూడ ఆలోచించకుండా అటువంటి అవకాసం తన నిజజీవితంలో వస్తే నయనతారను కిడ్నేప్ చేసి అమ్మేస్తానని ఆమె సమక్షంలోనే అనడంతో ఆ అవార్డు ఫంక్షన్లో ఉన్నవారంతా తెగ నవ్వుకున్నారట. ఈమాటలను విన్న మన అనామిక నయనతార కూడ ఒక్క క్షణం షాక్ అయి అందరి నవ్వులతోను తన నవ్వును కూడా శ్రుతి కలిపిందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. నయనకు అంత క్రేజ్ ఉంది కాబట్టే మూడు పదుల వయసు దాటిపోయినా కొట్లలో పారితోషికం తీసుకుంటూ యంగ్ హీరోయిన్స్ ను దడదడ లాడిస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: