వెంకటేష్ సినిమాలు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాయి. అయితే ఈ వారం విడుదల కాబోతున్న వెంకటేష్ ‘దృశ్యం’ సినిమాలో ఒక సన్నివేశంలో వెంకటేష్ నందమూరి సింహం బాలయ్యను ఇమిటేట్ చేస్తూ బాలయ్య బాడీ లాంగ్వేజ్ పై సెటైర్లు ఉన్నాయని ఫిలింనగర్ టాక్.  సామాన్యంగా మన టాప్ హీరోల సినిమాలలో మిగతా హీరోల బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ సెటైర్లు వేయడం చాల అరుదుగా ఉంటుంది. దీనికి కారణం మిగతా హీరోల అభిమానులు కోపగిస్తే తమ సినిమా టార్గెట్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో మిగతా హీరోల ప్రస్తావన సామాన్యంగా తీసుకురారు. అయితే ‘దృశ్యం’ సినిమాలో ఏకంగా వెంకటేష్ బాలయ్యను టార్గెట్ చేసాడు అనే వార్త ప్రస్తుతం టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారింది. అయితే వెంకటేష్ మాత్రం ఈ రుమర్లకు చెక్ పెడుతూ తాను అనుసరించింది బాలయ్యను కాదని బహుశా ఆ స్టైల్ రజినీకాంత్ ది అయి ఉంటుందని అనే విషయాన్ని అస్పష్టంగా మీడియాతో చెప్పడంతో వెంకీ బాలయ్యనే టార్గెట్ చేసాడు అనే రూమర్ మరింత పెరిగి పోయింది.  దృశ్యం మలయాళ మాతృకలో హీరో మోహన్ లాల్ ముమ్ముట్టి స్టైల్ ను అనుసరించాడు. అందువల్ల వెంకీ ఇక్కడ బలయ్యనే అనుసరించి ఉంటాడు అని అంటున్నారు. ఏదైనా ఈ విషయం రాబోతున్న శుక్రు వారం తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: