గత కొంత కాలంలో మెగా ఫ్యామిలిలో స్టార్ డం వార్ జరుగుతందనేది టాలీవుడ్ టాక్. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెగా హీరోలు అంతా ఒక వైపు ఉంటే, పవన్ కళ్యాణ్ ఒక వైపు ఉన్నాడు. ఇంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కి, మిగతా మెగా హీరోలకి సంబంధం లేదంటూ కూడ ఫ్యాన్స్ మధ్య వాగ్వాధాలు జరిగిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోవిందుడు అందరివాడేలే లో రామ్ చరణ్ తన పేరుకి ముందు ఉన్న మెగా పవర్ స్టార్ అనే పేరుని తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నటిస్తున్న గోవిందుడు అందరి వాడు మూవీకి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ అప్ కమింగ్ మూవీ టైలర్ లో రామ్ చరణ్ సరి కొత్త ట్రెండ్ ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. అయితే టైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దానిపై చిత్ర నిర్మాత బండ్లగణేష్ స్పందించాడు. ‘ ఇప్పుడే ‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ చూశాను. సూపర్ గా ఉంది. అభిమానులు ఎప్పుడు ఈ ట్రైలర్ చూస్తారో అని ఆశగా చూస్తున్నాను. కాంట్ వెయిట్ ఫర్ ద ఫ్యాన్స్ టు సి ఇట్. మా గోవిందుడిని ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూనే ఈ దసరాకి పండగే ‘ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ టైలర్ లోనే రామ్ చరణ్ పేరు మార్పుని కూడ చూపించారని ప్రొడక్షన్ హౌస్ నుండి వినిపిస్తున్న టాక్. మెగా పవర్ స్టార్ పేరుని మార్చి, కేవలం మెగా స్టార్ ని మాత్రమే పెట్టారనే వార్తలు తెలుస్తున్నాయి. మొత్తంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చాడనే న్యూస్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ పోనీ టెయిల్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: