టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి యస్.యం.యస్ మూవీతో ఎంట్రి ఇచ్చిన హాట్ బ్యూటి రెజీనా కసాండ్రె. ప్రస్తుతం ఈ బ్యూటికి మార్కెట్ లో డిమాండ్ ఉంది. ముఖ్యంగా కుర్ర హీరోలకి హాట్ ఫేవరేట్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కొత్తజంటతో సినిమా తరువాత రెజీనాకు భారీగానే డిమాండ్ పెరిగింది. ఈ మూవీ తరువాత రెజీనాకి వరుస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అందరి హీరోయిన్స్ లాగే రెజీనా సైతం తన రెమ్యునరేషన్ ని ఏకంగా వందశాతం పెంచేసింది. నిర్మాతలు సైతం రెజీనా ఎంత శాతం రెమ్యునరేషన్ ని పెంచుకున్నా, ఆ అమౌంట్ చాలా చిన్నదిగానే కనిపిస్తుందట. అందుకే రెజీనాను తీసుకోవటానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన రెజీనా-సందీప్ కిషన్ జంటగా నటించిన మూవీ రారా కృష్ణయ్య. ఈ మూవీలో వీరిద్దరి కాంబినేషన్ సూపర్భ్ అంటున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో రొటీన్ లవ్ స్టొరీ సినిమాలో కలసి నటించిన ఈ జంట అప్పట్లోనే బాగా క్లోజ్ అయ్యారట. ఇక ఈ సినిమా సమయానికి ఆ కెమిస్ట్రీ ముదిరి పాకాన పడి ఇంకా బాగా వర్క్ అవుట్ అయిందట. అంతే కాకుండా సందీప్ తో రెజీనా డేటింగ్ చేస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో చిన్ని చిన్ని డ్రెస్సులతో రేజీనా రెచ్చిపోయింది. సందీప్ మాత్రం రెజీనా విషంలో ఎంత కూల్ గా ఉన్నప్పటికీ, రెజీనా మాత్రం సందీప్ ని రెచ్చగొడుతుందంట. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ ఎఫైర్ జోడి అని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి రెజీనా ఏ మూవీలో నటిస్తే ఆ మూవీ హీరోతో రిలేషన్ ను మెయింటెన్ చేస్తుందని, అందుకే హీరోలు రెజీనాను ఇష్టపడుతారని అంటారు. మొత్తానికి వీరిద్దరి వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో అని టాలీవుడ్ తెగ ఆసక్తిగా గమనిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: