పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ ను గురించి కాని లేదంటే తన గురించి కాని నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తూ వార్తలు రాసే వెబ్ మీడియా, ప్రింట్ మీడియా సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ప్రకటన రూపంగా హెచ్చరించి ఒకరోజు కూడ పూర్తి కాకుండానే ఒక ప్రముఖ ఇంగ్లిష్ దిన పత్రిక వెబ్ సైట్ లో కనిపిస్తున్న ఒక మార్ఫింగ్ పోస్టర్ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ పవన్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నట్లుగా ఎపి హెరాల్డ్ కు అందుతున్న సమాచారం.  ఇక వివరాలలోకి వెళితే ఎవరో కొందరు కావాలని పవన్ పోలికలతో ఉన్న ఒక ఫోటోను పెట్టి క్రియేట్ చేసిన ఆ పోస్టర్ లో ‘‘నారా చంద్ర మోడీ సమర్పణలో పాగల్ కళ్యాణ్ నటించు శిఖండి పూజకు పనికి రాని పువ్వు'' అనే మాటలతో ఉంది. ఒక వైపు పవన్ తన గురించి నెగిటివ్ ప్రచారం చేయవద్దని స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నా మరొక వైపు పవన్ ను టార్గెట్ చేస్తూ ఇటువంటి నెగిటివ్ ప్రచారం ఇంకా కొనసాగడం ఆశ్చర్యకరం.  ఒక వ్యక్తి ఉద్దేశ్యాలు నచ్చకపోయినా అతడి మనసు గాయపరిచే విధంగా ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో మరి. ఏమైనా ఇటువంటి నెగిటివ్ పబ్లిసిటీ వ్యవహారాలు టాలీవుడ్ ఎంపరర్ గా కొనసాగుతున్న పవన్ కు ఉన్న క్రేజ్ ను పోగొట్టలేవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: