దసరాను టార్గెట్ చేసుకుని అక్టోబర్ లో విడుదలకు శరవేగంగా సిద్ధమవుతున్న ‘గోవిందుడు అందరి వాడే’ సినిమా టీజర్ ఈనెల దర్శకుడు కృష్ణవంశీ పుట్టిన రోజునాడు రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు విడుదలైన ‘ఆగడు’ టీజర్ మించి ‘గోవిందుడి’ టీజర్ హడావిడి ఉండాలని మెగా కాంపౌండ్ ఆలోచన అని అంటున్నారు.  ఇప్పటికే బిజినెస్ పరంగా కూడ బాగా మార్కెట్ అవుతున్న ఈ సినిమా గురించి మరొక ఆశక్తికర విషయం ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ సినిమా ఆడియోను మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆగస్టు 20న విడుదల చేయడానికి ఫిలిం యూనిట్ నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ ఆడియో విడుదల డేట్ కు రెండురోజుల తరువాత వచ్చే చిరంజీవి పుట్టినరోజు నాడు కాకుండా ఆగష్టు 20న ‘గోవిందుడి’ ఆడియో విడుదల అవుతుంది అని తెలుస్తూ ఉండటంతో చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22న మెగాస్టార్ 150వ సినిమాకు సంబంధించి ఎదో ఒక కీలక ప్రకటన వెలువడుతుందని అందుకోసమే గోవిందుడు ఆడియో చిరూ పుట్టినరోజుకు ముందు జరుగుతోంది అంటూ గాసిప్పుల హడావిడి ఫిలింనగర్ లో విస్తారంగా వినిపిస్తోంది అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా చిరంజీవి పుట్టినరోజునాడు బయట పడే సంచలన వార్త కోసం మెగా అభిమానులు ఇప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: