ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డులుగా భావించే ఫిలిం ఫేర్ అవార్డులకు మన సినిమా సేలిబ్రెటీలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ అవార్డు కోసం ప్రతి ఒక్కరు కలలు కంటూనే ఉంటారు. అవార్డు రాకపోయినా ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ స్టేజ్ పై డాన్స్ చేసే అవకాశాన్ని జాతీయ స్థాయి అవార్డుగా ఫీల్ అవుతారు మన హీరోయిన్స్.  ఈ వేదిక మీద డాన్స్ చేయడం ద్వారా ఆశిన్ లాంటి ఎందరో హీరోయిన్స్ కు బాలీవుడ్ లో అవకాశాలు దొరికాయి. ఈ నేపధ్యంలో మొన్న శనివారం చెన్నైలో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ లో ఎన్నో ఆశలతో అద్భుతాలు చేద్దాం అని అనుకున్న తాప్సీ ఆసలు నిరాసలుగా మారాయని వార్తలు వస్తున్నాయి. తాప్సీ చేసిన స్పెషల్ సాంగ్ ను గత సంవత్సరం ఇదే వేడుకలో శ్రుతిహాసన్ చేసిన స్పెషల్ సాంగ్ తో పోలుస్తూ పెదవి విరిచారని తెలుస్తోంది. తాప్సీ ఫిలింఫేర్ అవార్డు వేదిక పై తన అందాలను ఆరబోస్తున్నా ఎవరు పట్టించుకోలేదు సరికదా ఈ చొట్ట బుగ్గల సుందరి డాన్స్ ఎప్పుడు అయిపోతుందా అని అసహనంగా కూర్చున్నట్లు టాక్.  దీనిని బట్టి చూస్తూ ఉంటే తనకు బ్రేక్ ఇస్తుందనుకున్న ఫిలిం ఫేర్ అవార్డు నైట్ తాప్సీకి పీడకలగా మారింది అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: