మన భారతీయ సంస్కృతిలో పుట్టిన ప్రతి మనిషికి మరు జన్మ పై ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ఈ నమ్మకాలు మనకు తరతరాల వచ్చినవి. ఇప్పుడు అదే నమ్మకం కమెడియన్ బ్రహ్మనందంకు కూడ కలిగినట్లు ఉంది. అందువల్లనేమో తాను పెద్దగా మంచి పనులు చేయలేదు కాబట్టి వచ్చే జన్మలో మనిషిగా పుట్టే అవకాశం లేదు కాబట్టి కనీసం కుక్కగా అయినా వచ్చే జన్మలో పుట్టాలని దేముడుని కోరుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేసాడు బ్రహ్మి.  నిర్మాతల నుండి ముక్కు పిండి పారితోషికాలను వసూలు చేసే బ్రహ్మానందo నోటి వెంట ఇటువంటి వేదాంత ధోరణి మాటలు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మొన్న గురువారం రాత్రి ఆయన 'గీతాంజలి' చిత్రంలో చేసిన స్పెషల్ సాంగ్‌ లాంచ్ కార్యక్రంలో బ్రాహ్మి ఈ కామెంట్స్ చేసారు.  ఈ ఫంక్షన్ కు వచ్చిన వారంతా బ్రాహ్మిని తెగ పొగిడేసిన తరువాత బ్రహ్మానందం మాట్లాడుతూ తనకు. మరుజన్మ ఉందో లేదో తెలీదు అని అంటూ ఈ జన్మలోమనిషిగా పుట్టి అందర్నీ నవ్వించినట్లే వచ్చే జన్మ అనేది ఉంటే మళ్ళీ మనిషిగా పుట్టాలని కోరిక ఉన్నా అది జరగదని దానికి కారణం తాను ఏమి పుణ్యాలు ఏమీ చేయలేదని తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు బ్రాహ్మి .  ఒకవేళ మరు జన్మలో పుడితే ఏ కుక్క గానో, మరో జంతువుగానో పుట్టినా తోటి జంతువులను నవ్వించేట్లుగా పుట్టాలని కోరుకుంటున్నానని వేదాంత ధోరణితో చేసిన బ్రాహ్మి కామెంట్స్ ఇప్పుడు టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారాయి. ఇంతకీ బ్రహ్మానందంకు ఇంత వేదాంత ధోరణి హఠాత్తుగా ఎందుకు వచ్చిందో అర్ధంకాక ‘గీతాంజలి’ స్పెషల్ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అతిధులు షాక్ అయ్యారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: