బాలీవుడ్ లో ఓ ఊపు ఊపిన మూవీ ఆషికి2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన రిమేక్ ల పర్వం నడుస్తుంది. ఇప్పటికే తెలుగులో రిమేక్ అయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులని శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీని తమిళ్ వెర్షన్ లో రిమేక్ చేయాలని అనకుంటున్నారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. హిందీలో హిట్టయిన 'ఆషికి 2' చిత్రాన్ని బండ్ల గణేష్ తెలుగులో రీమేక్ చేశాడు. తమళ వెర్షన్ రిమేక్ కి సైతం బండ్ల గణేష్ రెడీగా ఉన్నాడు. సచిన్ జోషి, నాజియా జంటగా 'నీ జతగా నేనుండాలి' పేరిట తెలుగులో ఇది రూపొందుతోంది. అయితే తమిళ్ లో సచిన్ జోషి హీరోగా ఉంటే, హీరోయిన్ కోసం హన్సికని పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హన్సికతో బండ్ల గణేష్ మాట్లాడినట్టుగా చిత్ర వర్గాల నుండి సమాచారం. అలాగే సచిన్ జోషి సైతం హన్సికని అప్రోచ్ అయి, ఆషికి2 తమిళ్ రిమేక్ లో నటించాలని కోరాడట. అందుకు హన్సిక దాదాపు ఒప్పుకున్నట్టగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ త్వరలోనే బయటకు రానుంది. అయితే హన్సిక ఈ మూవీలో నటించేందుకు భారీగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్టుగా కోలీవుడ్ అంటుంది. దాదాపు కోటి రూపాయల వరకూ హన్సిక తన రెమ్యునరేషన్ పరంగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా బండ్ల గణేష్, ఆషికి2 రిమేక్ లపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: