నిన్న మొన్నటిదాకా పవన్ పాటలను తన సినిమాల టైటిల్స్ గా పెట్టుకుని తన భయంకరమైన ఫ్లాప్ రికార్డుల నుండి బయటకు వచ్చిన నితిన్ బాటను ఈరోజు చాలామంది హీరోలు టాలీవుడ్ లో అనుసరిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న సాయికుమార్ తనయుడు ఆది తన ‘గాలిపటం’ సినిమాలోని పంచ్ డైలాగ్స్ కు కూడ పవన్ భజననే ఎంచుకున్నాడు.  ఇప్పుడు ఆ లిస్టులో తాను ఏమి తక్కువ కాదు అంటూ దగ్గుబాటి వారి అబ్బాయి రానా కూడ చేరిపోయాడు. హైదరాబాద్ లోని ఆటోల మీద ఉండే పవన్ కళ్యాణ్ పోస్టర్లను ఫోటోలుగా తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ పవన్ పై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. హైదరాబాద్ లోని అరుదైన కట్టడాలు, దృశ్యాలు చూడచక్కని ఫోటోలుగా తీసి తన అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్టు చేయడం ఎప్పటి నుంచో రానా కు ఉన్న అలవాటు. ఆ అలవాటు ప్రకారమే పవన్ ఫోటోలను కూడ పోస్టు చేస్తూ ‘పవర్ స్టార్ ఈజ్ సూపర్ స్టార్ ట్రూలీ’ అని కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  బహుశా రానా తన  బాబాయి వెంకటేష్ తో కలిసి పవన్ ‘గోపాలా గోపాలా’ లో నటిస్తూ ఉండటంతో ఆ కాంబినేషన్ కు మరింత క్రేజ్ పెంచడానికి రానా ఈ కొత్త ఎత్తుగడ వేసాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: