దర్శకుడు గుణశేఖర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా షూటింగ్ లో భారీ దొంగతనం జరిగినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుమారు 5కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు షూటింగ్ స్పాట్ నుండి మాయం అవడం టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ గా మారింది. రుద్రమదేవి పాత్రను నటిస్తున్న అనుష్క కోసం నిజమైన బంగారు నగలు వాడుతూ ఉండటంతో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక బాక్స్ లో బంగారు నగలు మరొక బాక్స్ లో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి షూటింగ్ స్పాట్ లో ఉంచడం గుణశేఖర్ అలవాటు అని టాక్ .  ఈ పద్దతిలోనే నిన్న నానక్ రామ్ గుడా, గోపన్ పల్లి ప్రాంతాలలో షూటింగ్ నిర్వహిస్తున్నప్పుడు బంగారు నగలు ఉన్న బాక్స్ మిస్ అయింది అని అంటున్నారు. ప్రతి విషయాన్ని చాల సహజంగా భారీగా తీసే గుణశేఖర్ గతంలో తాను తీసిన సినిమాలలో భారీ చార్మినార్, మీనాక్షి అమ్మవారి ఆలయాల సెట్స్ వేసినట్లే ఈసారి ‘రుద్రమదేవి’ లో ఎవరూ చేయని విధంగా నిజమైన బంగారు ఆభరణాలతో ‘రుద్రమదేవి’ ని తీస్తున్నాడు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న గుణశేఖర్ ‘రుద్రమదేవి’ కి ఇది అనుకోని షాక్ అనుకోవాలి. పోలీసులు ఈ విషయం పై చాల లోతుగా విచారిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: