ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు హీరాయిన్లు తమ క్రేజ్ కు తగ్గట్లు కోట్లు పుచ్చుకుంటూనే తమ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజం పట్ల తమకు ఉన్న భాద్యతను ఎంతోకొంత నెరవేరుస్తున్నారు. రాజకీయ సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండే నందమూరి కుటుంబ వారసుడిగా ఉండే జూనియర్ చాలాకాలంగా తన దగ్గర పనిచేసే స్టాఫ్ పిల్లలకి చదువు కోసం ఆర్ధిక సహాయం చేస్తుంటాడు అనే పేరు ఉంది.  అంతే కాకుండా గతంలో కొన్ని కాలేజీలకు జిమ్ ఎక్విప్మెంట్ కూడా డొనేట్ చేసాడు ఈ నందమూరి యంగ్ టైగర్. అయితే ఈమధ్యనే ఎన్టీఆర్ చేసిన ఒక సహాయం టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారింది. ఇక వివరాలలోకి వెళ్ళితే గతంలో ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన ఓ వ్యక్తి తండ్రికి తీవ్ర ఆనారోగ్యానికి గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు జూనియర్ దృష్టికి వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కిమ్స్ హాస్పటల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ వ్యక్తి వైద్యానికి అవసరమైన 3 లక్షలు సహాయం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా సెలెబ్రెటీలు అంతా తమ దగ్గర పనిచేస్తున్న వారి బాగోగులు చూడటం సర్వసాధారణం.  కానీ కొంతకాలం తన దగ్గర పనిచేసి మానేసిన వ్యక్తి తండ్రి వైద్యానికి ఎన్టీఆర్ సహాయం చేయడం టాలీవుడ్ ను ఆశ్చర్య పరచడమే కాకుండా జూనియర్ ఉదార స్వభావానికి నిదర్శనం అంటు చాలామంది జూనియర్ ను మెచ్చుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: